Ambati Rambabu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసి జైలుకెళ్లిన మాజీ ముఖ్యమంత్రులు ఎవరూ బతికి బట్ట కట్టలేదు, ఒక వేళ బయటకు వచ్చినా మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చిన సందర్భాలు లేవు.. ఒకరు ఇద్దరు తప్ప.. అన్నా డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి చూశారుగా అని గుర్తు చేశారు అంబటి రాంబాబు.. అలాంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతి ఇస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే పడవ.. ఎవరు వెళ్లి లేపినా లేచే పరిస్థితి లేదన్న ఆయన.. అలాంటి టీడీపీనీ తాను లేపుతానంటున్నాడు పవన్ కల్యాణ్.. అంటే చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ పార్టీ కూడా మునిగిపోతుందంటూ జోస్యం చెప్పారు. కాగా, ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.. ఇక, ములాకత్‌లో చంద్రబాబును కలిసిన తర్వాత.. టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తాయని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం విదితమే.
Read Also: Bus Stop: ఇదేందయ్యా ఇదీ.. రాత్రికి రాత్రే బస్టాండ్‌ను ఎత్తుకెళ్లారు!