ఆంధ్రా ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో పనులు వేగంగా సాగుతున్నాయి. న్యూఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర నిపుణుల బృందం శనివారం పోలవరం ప్రాజెక్టుని పరిశీలించింది. కేంద్ర జలశక్తి సంఘం సభ్యులు కె.వోహ్రా, సి.డబ్ల్యు.సి. సి.ఇ. ఎం.కె. సిన్హా, కృష్ణా గోదావరి రివర్ బోర్డు అధికారి డి. రంగారెడ్డి, సి.డబ్ల్యు.సి. సి.ఇ. ఆర్కే పచోరి, పి.పి.ఎ. మెంబర్ సెక్రటరీ ఎం.కె. శ్రీనివాస్, సీ.డబ్ల్యూ.సీ. డైరెక్టర్ సంజయ్ కుమార్, డిజైనింగ్ సి.ఇ. మొహమ్మద్ ఖయ్యుం , పి.పి.ఎ. సి.ఇ. ఏ.కే.…
ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గ్రామం వద్ద గల ఏలూరు కెనాల్ ను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఎకరానికి సాగు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ పనులను అవగాహన లేకుండా చేపట్టారని ఆయన ఆరోపించారు. ముందు చూపు లేకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం చారిత్రక తప్పిదమని ఆయన మండిపడ్డారు. తప్పు ఎవరి…
అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారం లేకపోతే చంద్రబాబు పిచ్చెక్కిపోతాడని ఆరోపించారు. ఆయన జిమ్మిక్కులను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. అవకాశం దొరికితే దేశాన్ని నాశనం చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు అని.. అసలు రాయలసీమకు ఆయన ఏం చేశారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 151 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి సీఎం పదవికి అనర్హుడట……
ఏపీలో అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఎవ్వరూ తగ్గకుండా పోటీపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.. వాతారణం చూస్తుంటే.. అప్పుడు ఎన్నికలు వస్తాయా? అనే అనుమానాలు కలిగిస్తోంది.. గత కొంత కాలంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. అక్క ఆరాటమే తప్ప బావ బతకడు.. అంటూ సెటైర్లు వేశారు. కొన్ని పత్రికల ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతకరని జోస్యం చెప్పారు.. చంద్రబాబు పగటి కలలు కంటున్నారు.. కానీ, షెడ్యూల్ ప్రకారమే…
టీడీపీ, జనసేన పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. సింగిల్ గా పోటే చేసే దమ్ము లేకే చంద్రబాబు పొత్తుల ఎత్తులు వేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది కట్ట కట్టుకుని వచ్చినా దించలేరనే ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సవాల్‌పై స్పందించిన అంబటి… విద్యుత్ చార్జీలు ఏపీ కన్నా కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి.. ఆర్టీసీ ఛార్జీలు మహారాష్ట్రలో ఎక్కువ, మరి రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావు చంద్రబాబూ..? అంటూ ప్రశ్నించారు. రాజకీయ సన్యాసం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంపై ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. అయితే, ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు 2018 లోపలే పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారుగా.. అపారమైన జ్ఞానం ఉన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు.? అని ప్రశ్నించారు. నాకు మిడిమిడి జ్ఞానం ఉందని చంద్రబాబు మీడియా…
పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని.. పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరని.. దశలవారీగా ఆ పని పూర్తిచేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోందని… 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని స్పష్టం చేశారు. అక్కడి వరకు ఉన్నవారికి ముందుగా పునరావాసం కల్పిస్తారని వివరించారు. పోలవరం ప్రాజెక్టులో త్వరగా అయిపోయే పనులు…