Ambati Rambabu: అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు తాము చేసిన తప్పును ఒప్పుకోవాలని సూచించారు మంత్రి అంబటి రాంబాబు.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు మీడియాతో పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఒక అంశాన్ని టీడీపీ అంగీకరించాలని నా విజ్ఞప్తి.. చంద్రబాబు 45 ఏళ్ల జీవితంలో అనేక పాపాలు, ఘోరాలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతగా ఉండి ఎన్టీఆర్ పై పోటీ చేస్తానని చెప్పి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచారు.. టీడీపీలో చేరిన తర్వాత పిల్ల ఇచ్చిన మామకు కూడా వెన్నుపోటు పొడిచారు.. ఎన్టీఆర్ మరణానికి కారణం అయ్యారు.. డబ్బు మదంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు.. ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారంటూ విమర్శలు గుప్పించారు.
Read Also: Akasa Air Lines: ఆకాశ ఎయిర్ లైన్స్ మూసీవేత.. సీఈఓ ఏమన్నారంటే?
వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు చచ్చిన సామెత ఇప్పుడు గుర్తుకు వస్తుందన్నారు అంబటి రాంబాబు.. కుంభకోణమే జరుగలేదు, రాజకీయ కక్ష సాధింపు అని అంటున్నారు.. రాజకీయ కక్ష సాధింపు లేదని నేను ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.. ఇప్పటి వరకు అవినీతి చేసినా దొరకకుండా తప్పించుకున్నారు.. ఇప్పుడు పూర్తి ఆధారాలతో దొరికి పోయారు. అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు తప్పును ఒప్పుకోండి.. బుకాయించకుండా ప్రజల మద్దతు పొందండి అంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సలహా ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.. కాగా, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.. స్పీకర్ సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు.. వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.. స్పీకర్ పోడియం దగ్గర నిరసనకు దిగారు.. టీడీపీ సభ్యుల నిరసన మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తున్నారు.