నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఉద్రక్తతపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు.. ఆంధ్ర భూభాగంలో తెలంగాణ పోలీసులు ఉంటున్నారు.. మా నీరు మా రైతులకు విడుదల చేయాలంటే తెలంగాణ అనుమతి ఎందుకు?.. మా భూభాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు.
Minister Ambati Rambabu: చచ్చేంత వరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటా.. పార్టీ మారను.. మారబోను అంటూ స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు రుణ మాఫీ అని మహిళలను మోసం చేశాడు.. బంగారు రుణాలు మాఫీ అని చేతులు ఎత్తే శాడు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు.. అందుకే వై ఎపీ నీడ్స్ జగన్…
వస్తున్నా.. మీ కోసం కాదు..! వస్తున్నా కంటి ఆపరేషన్ కోసం అని మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు. కళ్లు కనిపించకే మధ్యంతర బెయిల్ ఇచ్చారు.. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనంటూ ఆయన విమర్శించారు. విజనరీ లీడర్ కి.. విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారు!.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌పై స్పందిస్తూ సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. హై కోర్టులో చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారన్న ఆయన.. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని టీడీపీ నాయకులు హంగామా చేస్తున్నారు.. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానాలి.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు.
ఒక పని చేస్తే చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి అంబటి రాంబాబు.. విదేశాలకు పంపించిన తన మాజీ పీఏ శ్రీనివాస్ ను వెనక్కి పిలిపించాలని.. శ్రీనివాస్ వెనక్కి వస్తే.. చంద్రబాబుకు వెంటనే బెయిల్ లభించే అవకాశం ఉందన్నారు.
గత ఏడాది కూడా ఒక సామాజిక వర్గ సమావేశంలో ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశారు.. నన్ను భౌతికంగా లేకుండా చేస్తే 50 లక్షల బహుమానం ఇస్తామని అప్పుడు ప్రకటించారు, ఇవాళ భౌతికంగా నా పై దాడి చేయటానికే వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు
టీడీపీ, జనసేన మీటింగ్‌లో ఏదైనా విషయం ఉందా..? బలహీన పడ్డ టీడీపీని బలోపేతం చేయడం కోసం కలిశానని పవన్ కళ్యాణ్ చెప్ప్తున్నారు.. కానీ ప్రజలు ఈ కలయికని పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. అయితే, మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ( ఎక్స్ ) సొంత కుమారుడు.. అద్దె కుమారుడు.. ఇద్దరూ ఉత్తర కుమారులే !.. సూటుకేసు తీసుకో..లోకేషుతో కలిసిపో!.. అనే పోస్ట్ ను పెట్టారు.
ఇప్పుడు లోకేశ్ కూడా ఏడుస్తున్నాడు.. చంద్రబాబు ఏడుపు నాటకం, లోకేశ్ ఏడుపు ఆవేదన అనిపిస్తుంది.. తన లాంటి చేత గాని పప్పుకు కూడా మూడు శాఖలు ఇచ్చిన తన తండ్రి చంద్రబాబును జైల్లో వేశారని లోకేశ్ ఆవేదన చెందుతున్న పరిస్థితి అని ఆయన అన్నారు.