టీడీపీ నేతలపై ఒకరేంజ్‌లో ఫైరయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అయ్యన్న పాత్రుడు మహిళా మంత్రి పై చెప్పిన మాటలు వింటే మహిళలు ఎవరూ టీడీపీకి ఓటు వేయరన్నారు. 151 కోట్ల స్కాం చేసిన అచ్చెన్నాయుడును బొక్కలో వేయకుండా ఏం చేస్తారు? రాష్ట్రంలో ఎవరికీ ఇంగ్లీష్ వద్దంటాడు చంద్రబాబు…తన కొడుకును మాత్రం ఇంగ్లీషులో చదివిస్తాడన్నారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబుకు సిగ్గుందా? చంద్రబాబు హయాంలో 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి ఇస్తోంది.…
ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. మంత్రులు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రేమికులు దొరుకుతారేమో అని తిరుగుతున్నారు. అందుకే అనకాపల్లి జిల్లాలో ఈ రెండు రోజుల సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. 74 ఏళ్ల చంద్రబాబునాయుడు నాది వన్ సైడ్ లవ్వు నన్ను ఎవరు ప్రేమించడం లేదని బాధ పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు…
విశాఖ లోని అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో ఎస్ఈజెడ్‌లోని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం పరిశీలించారు. గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి 9 గంటల వరకు అన్ని డిపార్ట్మెంట్ లతో రివ్యూ నిర్వహించడం జరిగింది. అధికారులు, ఎక్స్ పర్ట్స్ అభిప్రాయాలు తీసుకోవాలని కోరామన్నారు మంత్రి అమర్ నాథ్. అసలు ఎక్కడ నుండి గ్యాస్ లీక్ అయిందో…
విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్.. ఆయన దోపిడీ గ్యాంగ్ ధనదాహంతో విశాఖపట్నం విషాదపట్నమైంది. అధికారంలోకొచ్చిన నుంచీ ఎల్జీ పాలిమార్స్, సాయినార్ ఫార్మా.. నేడు బ్రాండిక్స్ సెజ్ లో ప్రమాదం జరిగాయన్నారు. వరుస విషవాయువు లీక్ ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకై 200 మంది అస్వస్థతకు…
విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు చికిత్స అందుతోంది. అయితే ఇద్దరి పరిస్థితి సీరియస్ గా వుందని తెలుస్తోంది. అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనలో 8మందికి తీవ్ర అస్వస్థత వుంది. కేజీహెచ్ లో ఎమర్జెన్సీ వైద్యసేవలు కోసం తరలించారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 120మందికి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీక్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. బ్రాండిక్స్ లో జరిగిందా లేక పక్కనే ఉన్న మరో కంపెనీ నుంచి లీక్ అయిందా అనేది నివేదికలో…
విశాఖపట్నం: అచ్యుతాపురం ఎస్.ఈ.జెడ్. గ్యాస్ లీక్ లో పెరుగుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. రెండు వందల మందికి పైగా అస్వస్థత కలిగింది. బాధితులకు ప్రాథమిక చికిత్స అనంతరం అనకాపల్లి,వైజాగ్ ఆసుపత్రులకు తరలింపు. అమోనియా గ్యాస్ కారణంగానే ప్రమాదం. గ్యాస్ లీక్ ఎక్కడ జరిగిందనే దానిపై దర్యాప్తు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్నాం అన్నారు ఎస్సీ గౌతమి శాలి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఫొటో ఇప్పుడు చర్చగా మారింది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి అమర్‌నాథ్ రెడ్డి కలిసి ఉన్న ఫొటో.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, పవన్‌పై అమర్‌నాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. ఇది నెట్టింట్లో ప్రత్యక్షమై తెగ తిరిగేస్తోంది.. ఇక, మంత్రిపై అమర్‌నాథ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.. పవన్‌పై ఇంతలా విరుచుకుపడే నీవు.. ఆయనతో కలిసి ఫొటో ఎందుకు తీయించుకున్నావు అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు..…