Minister Amarnath honored doctor Swathi Reddy
వేగంగా దూసుకుపోతున్న రైళ్లో గర్భిణీకి పురుడుపోసి అందరి మన్ననలు అందుకుంటోంది యువ డాక్టర్ స్వాతి రెడ్డి. కృతజ్ఞతగా పుట్టిన పాపకు స్వాతి పేరే పెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు. అంతేకాకుండా స్వాతి రెడ్డి ప్రభుత్వం కూడా సత్కరించింది. అయితే.. ప్రసవం చేసే సమయంలో చాలా టెన్షన్ పడ్డానని చెబుతోంది స్వాతి రెడ్డి. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 13న తెల్లవారుజామున సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్‌తో సత్యవతి అనే గర్భిణీ మహిళ పురిటి నొప్పులతో అవస్థపడింది. అయితే అక్కడున్నవారికి ఆమె పరిస్థితి అర్థం కాలేదు. దీంతో.. సత్యవతి భర్త ప్రయాణీకులందరినీ సాయం ఆర్ధిస్తూ.. అదే రైళ్లో ఉన్న హౌస్ సర్జన్ స్వాతి రెడ్డిని కూడా సాయం కోరాడు. అయితే.. ఆమె డాక్టర్ అన్న విషయం ఆయనకు తెలియదు. గాఢనిద్రలోంచి లేచిన స్వాతిరెడ్డి సత్యవతికి సాయం అందించాలని నిర్ణయించుకుంది. అప్పటికే బేబీ తల కొంచె బయటకు వచ్చింది. అయితే తాను డాక్టర్ అనే విషయాన్ని చెప్పి సత్యవతికి ధైర్యం కల్పించిన స్వాతి రెడ్డా.. గ్లౌస్ లేకపోయినా సక్సెస్‌ఫుల్‌గా ఆమెకు డెలవరీ చేసింది. స్వాతి రెడ్డి విశాఖ గీతం యూనివర్సీటీలో హౌస్ సర్జన్ చేస్తోంది.
ఆమె 12న రాత్రి విజయవాడలో విశాఖ దురంతో ఎక్కింది. 13న తెల్లవారుజామున ఉదయం 3.30 గంటల సమయంలో సత్యవతికి పురిటినొప్పులు మొదలయ్యాయి. అయితే సత్యవతి భర్త స్వాతిరెడ్డి సాయం కోరడంతో.. వెంటనే సత్యవతి దగ్గరకు చేరుకున్న స్వాతిరెడ్డి ఎలాంటి మెడికట్ కిట్ లేకున్నా విజయవంతంగా ప్రసవం చేసింది. ట్రైన్‌లో ప్రసవం చాలా రిస్క్.. ఏమైనా తేడా వస్తే తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదం. ప్రసవం జరుగే సరికి ట్రైన్ అనకాపల్లికి చేరుకుంది. అక్కడే తల్లీబిడ్డలను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారితో పాటే స్వాతి రెడ్డి కూడా వెళ్లింది. తల్లీబిడ్డ సేఫ్ అని నిర్థారించుకున్న తరువాత విశాఖకు వెళ్లిపోయింది. తమకు అపద్భాందవునిగా మారిన స్వాతిరెడ్డి పేరును పుట్టిన పాపకు పెట్టుకున్నారు సత్యవతి దంపతులు. స్వాతి రెడ్డిని సత్కరించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. అయితే.. గర్భణీ సత్యవతికి ప్రసవం చేస్తున్నప్పుడు కడుపులో బిడ్డ, గర్భిణీ గురించే తప్ప మరే ఆలోచన రాలేదని స్వాతిరెడ్డి వెల్లడించారు.