ఏపీలో మూడురాజధానుల వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా రాజధాని రాజకీయం వేడెక్కుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానుల కోసం ఉత్తరాంధ్రలో వైసీపీ ఉద్యమ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను వినిపించే దిశలో తొలి ప్రయత్నంగా ఈనెల 25న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. మరోవైపు, అమరావతి రైతుల పాదయాత్రకు రక్షణ కవచంగా నిలనడతామని బీజేపీ ప్రకటించింది. నియంత్రించే సాహసం చెయ్యడం అంటే అది బీజేపీని అడ్డుకోవడం గానే భావించాల్సి వుంటుందని హెచ్చరిస్తోంది.
ఉత్తరాంధ్రలో మరోసారి కార్యనిర్వాహక రాజధాని డిమాండ్ కు ఊపు తీసుకుని వచ్చే విధంగా ఉద్యమ కార్యాచరణ సిద్ధమైంది. అమరావతి రైతుల పాదయాత్రను ఈ ప్రాంతంపై జరుగుతున్న దండయాత్ర కనుక అడ్డుకుంటామని స్వయంగా మంత్రులు ప్రకటిస్తున్నారు. రాజకీయాలు, పార్టీల కంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆకాంక్షల నుంచి పుట్టిన కేపిటల్ నినాదం తమ విధానమని స్పష్టంగా చెబు తోంది. ఇప్పటికే విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా మూడు రాజధానులకు అనుకూల ప్రదర్శనలు జరుగుతున్నాయి. తొలుత ఈ నెల 25 న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తోంది.
Read Also: Uttar Pradesh: అత్యాచారానికి పాల్పడ్డితే ఇక అంతే.. కొత్త బిల్లు తీసుకువచ్చిన యోగి సర్కార్
అందులో భవిష్యత్ కార్యాచరణ ను నిర్దేశించబోతున్నట్టు మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. ఆ దిశగా చేసే ప్రయత్నాలు పార్టీ వేదికగా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ ఉంది. ఇప్పటి వరకు స్టూడెంట్, ఇంటిలెక్చువల్ జె.ఏ.సీ.లు మూడు రాజధానుల డిమాండ్ విన్పిస్తున్నా అంత ఎఫెక్టివ్ గా కనిపించడం లేదు. అందుకే వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం పేరుతో ఆదివారం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. అందులో వచ్చే సలహాల అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర అధికార పార్టీ నేతలంతా హాజరు కానున్నారు. సీనియర్ మంత్రులు బొత్సా సత్యనారాయణ, డిప్యూటీ సిఎం లు ముత్యాలనాయుడు, రాజన్న దొర సహా ఎమ్మెల్యే లు, ముఖ్యలు అంతా హాజరుకానున్నారు.
ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర అభివృద్ది ని కాంక్షించే వాళ్లంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్. రాజకీయ పార్టీలకు కూడా ఈ పిలుపు వర్తిస్తుందని ప్రకటించారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర వైపు వచ్చే పాదయాత్రను రైతులు విరమించుకుంటే మంచిదని సూచిస్తున్నారు అమర్నాథ్. మూడు రాజధానులపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపైన మండిపడుతున్నారు.మూడు రాజధానుల విధానంను వైసీపీ తప్ప మిగతా అన్నీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ది ని కాంక్షించే అందరినీ భాగస్వామ్యులు అయ్యే విధంగా ప్లాన్ చేస్తోంది వైసీపీ. విశాఖ రాజధాని కావాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలపై చర్చించనున్నారు.
దశల వారీగా ప్రజలను చైతన్యం చేసేందుకు పెద్ద యెత్తున సమావేశాలు, సభలు నిర్వహించాలని నిర్ణయించే అవకాశం ఉంది. ఇప్పటికే గడపగడపకు మూడు రాజధానులు నినాదం,వాటి వల్ల ఉత్తరాంధ్రకు జరిగే మేలును ప్రచారంలోకి తీసుకు ని వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి సమావేశం కీలకం కాబోతోంది. ఐతే, అమరావతి రైతుల పాదయాత్ర, మూడు రాజధానులపై వైసీపీ ప్రకటనలు,ప్రసంగాలను బీజేపీ సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. రైతులను అడ్డుకోవడం అంటే బీజేపీని అడ్డుకోవడంగానే భావిస్తామన్నారు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఆకాంక్షలే ప్రధానంగా కలిసి వచ్చే పార్టీలతో వెళ్తామని, ముడురాజధానులను స్వాగతించే వారిని ఆహ్వానిస్తామని వైసీపీ చెబుతోంది.
Read Also: Vizag Fishing Harbour: విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉద్రిక్తత… మత్స్యకారుల ఆందోళన