తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం ఎత్తుకున్నారు ఎమ్మెల్యేలు.. మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మె్ల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. మంత్రికి వ్యతిరేకంగా సమావేశమైన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేక్, మైనంపల్లి, బేతి సుభాష్ రెడ్డి.. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని వాపోయారు.. మైనంపల్లి నివాసంలో సమావేశమైన ఐదుగురు నేతలు మల్లారెడ్డి అంశాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిచింది.. అయితే, ఎమ్మెల్యే సమావేశంపై స్పందించిన…
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నరు. ఇందు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సీసీ కెమెరాలో నమోదైంది.
ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్, కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా నగర పరిసరాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం పూట పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువతి రోడ్డును క్రాస్ చేసి జాతీయ రహదారిపై అటు నుంచి ఇటు రోడ్డుపై దాటుతుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రేమకు వయస్సుతో సంబంధంలేదు. ఇది మనం తరచూ వినే మాట. ప్రేమలో పడ్డవారు ఎవరి గురించి ఆలోచించరు. ప్రేమలో వున్నవారికి వారు తప్ప మరెవరు కనిపించరు. ఏంచేస్తున్నారో వారికే తెలియదు. ప్రేమలో వుంటే సినిమాలు చూసి తెగింపు వచ్చేస్తుంది. కని పెంచిన తల్లిదండ్రులకంటే ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయి, అమ్మాయి పై ప్రేమ అంటూ వెంటబడి వారితో మన జీవితం అంటూ ఫిక్స్ అయిపోతారు. వారు జీవితంలో లేకుంటా బతకలేము అనే ఫీలింగ్ లో వెళతారు.…
కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ల వల్లే పెట్రోలో, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు చింతలపల్లిలో పర్యటించారు. మంత్రి మాల్లారెడ్డితో కలిసి మూడు చింతలపల్లిలో రూ.15 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, 15 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం, 13.5 లక్షలతో…
నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపూరి కాలనీలోని దారుణం జరిగింది. మైత్రి నివాస్ అపార్టుమెంట్లోని 202 నెంబర్ ఫ్లాట్లో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. తల్లి మృతదేహంతో పాటు మూడు రోజులుగా అపార్ట్మెంట్లోనే కుమారుడు ఉన్నాడు. సాయి కృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని తరచూ తల్లి, కొడుకులు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు. కొడుకు మానసిక స్థిమితం బాగా లేకపోవడంతో కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. ఫ్లాట్ నుండి దుర్వాసన…
మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ప్రియుడితో కలిసి ఓ భార్య, తన భర్తను అతికిరాతకంగా హత్య చేసింది. హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించి చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. అక్బర్జాపేట్ గ్రామానికి చెందిన మహంకాళి కృష్ణ, మహంకాళి లక్ష్మీ భార్యాభర్తలు. 2014 లో గుంటి బాలరాజ్ అనే వ్యక్తితో కలిసి కృష్ణ ఒక ఆటో కొనుగోలు చేసి నడుపుతున్నారు. అప్పటినుంచి బాలరాజ్ కన్ను మహంకాళి లక్ష్మీపై పడింది. కొన్నిరోజుల్లో ఆమె కూడా బాలరాజ్ పై…