Drunkard: పెళ్లి చేసుకునేందుకు పిల్ల దొరకట్లేదు.. బట్టలు విప్పి హల్ చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A drunken man created a ruckus in Medchal: మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. మద్యం తాగి నానా హంగామా సృష్టించాడు. రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ జై కొట్టాడు. తనకు పెళ్లి చేసుకునేందుకు పిల్లదొరకట్లేదంటూ బూతులు తిడుతూ రోడ్డుపై బట్టలు విప్పి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. అక్కడే వున్న అంబేద్కర్ విగ్రహం ఎక్కి జై అంటూ నినాదాలు చేశాడు. రోడ్డు పడుకుని దండాలు పెడుతూ నానా హంగామా చేశాడు. మద్యం మత్తులో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని పరిస్థితి. దీంతో స్థానికులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు మద్యం మత్తులో వున్న వ్యక్తిని కంట్రోల్ చేసేందుకు నానా కష్టాలు పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ పట్టణంలో చోటుచేసుకుంది.
మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి 44 పై అర్థరాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో బట్టలు విప్పేసి హల్చల్ చేశాడు. రహదారిపై పడుకొని వాహనాలను అడ్డుకుంటూ జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి అని నినాదాలు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందికి గురిచేశాడు. స్థానిక సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్నారు పోలీసులు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం లెక్కచేయకుండా చౌరస్తా దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎక్కి జై అంబేద్కర్.. జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశాడు. తనకు పెళ్లి చేసుకునేందుకు పిల్ల దొరకట్లేదు అంటూ బూతులు తిడుతూ రోడ్డుపై హంగామా సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులు కంట్రోల్ చేసేందుకు చమటలు పట్టాయి. అయినా పోలీసులు సహనంతో అతన్ని ఎవరు నువ్వు? నీ పేరు ఏంటి? సమాచారం సేకరించి కుటుంబ సభ్యులను అప్పగించారు.
Niharika : ఆ హీరోతో నిహారిక రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో పుకార్లు
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!