విద్యార్థులకు క్రమశిక్షణ సంస్కారం నేర్పాల్సిన ఫిజికల్ డైరెక్టర్ విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ ఆనంద్ అరాచకం సృష్టించాడు. ఒంట్లో బాగా లేదన్నా వినకుండా 8 మంది విద్యార్థినిలను పీఈటీ చితకబాదాడు.
Car Fireaccident : మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజీ గూడ ఫ్లైఓవర్‌పై ఘోర ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో జరుగుతున్న మల్లన్న జాతరను తిలకించేందుకు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన నలుగురు యువకులు కారులో బయలుదేరారు. అయితే, ప్రయాణానికి కొద్దిసేపటికే పోచారం సమీపంలోని అన్నోజీ గూడ ఫ్లైఓవర్‌పైకి చేరుకునే సరికి కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు.. అప్రమత్తమైన యువకులు కారును వెంటనే…
డ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ అమానుష ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను పరిశీలించారు.
Fire Accident: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నేషనల్ హైవే పక్కన క్లాసిక్ దాబా వద్ద ఉన్న పోలిక్యాబ్ శానిటేషన్ ఎలక్ట్రికల్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
CMR College : మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లలో రహస్యంగా కెమెరాలు అమర్చి, వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థినులు నిరసనకు దిగారు. ఈ పరిణామాలపై హాస్టల్ వంట సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థినులు…
మేడ్చల్ జిల్లాఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్‌ను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు.
గుర్తు తెలియని మహిళ పుర్రె లభ్యమైన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి గ్రామంలోని నార్నే ఎస్టేట్‌లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి పుర్రె, వెంట్రుకలు, చీర, బ్లౌజ్, చేతి సంచి, ఒక చెప్పు కనపడింది. దీంతో వెంటనే స్థానిక మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మేడ్చల్ సీఐ అద్దాని సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ మురళీధర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Malla Reddy: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.