Road accident in Medchal: మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువతి రోడ్డును క్రాస్ చేసి జాతీయ రహదారిపై అటు నుంచి ఇటు రోడ్డుపై దాటుతుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ వస్తున్న విషయం కూడా గమనించకుండా రోడ్డును దాటే ప్రయత్నం చేసింది యువతి. లారీ డ్రైవర్ ఎంతగా తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆయువతి బైక్ ను క్రాస్ చేయడానికి లారీ ఎదుట రావడంతో.. లారీ తనపై నుంచి దూసుకు పోయింది.
దీంతో ఆమహిళ అక్కడికక్కడే మరణించింది. రోడ్ క్రాస్ చేస్తూన్న మహిళ లారీని వస్తున్న విషయాన్ని సైతం గుర్తించకుండా రాంగ్ రూట్ లో అలానే ముందుకు దూసుపోతుండటంతోనే ఈ సంఘటన జరిగింది. స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువతి ప్రియా మోర్ గా గుర్తించారు. ఈ ప్రమాదం దృశ్యాలు సి.సి ఫుటేజ్ లో నమోదు అయ్యాయి. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Madhyapradesh Minister: అలా చేస్తే తలక్రిందులుగా వేలాడదీస్తా.. అధికారికి మంత్రి బెదిరింపులు