తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం ఎత్తుకున్నారు ఎమ్మెల్యేలు.. మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మె్ల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. మంత్రికి వ్యతిరేకంగా సమావేశమైన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేక్, మైనంపల్లి, బేతి సుభాష్ రెడ్డి.. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని వాపోయారు.. మైనంపల్లి నివాసంలో సమావేశమైన ఐదుగురు నేతలు మల్లారెడ్డి అంశాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిచింది.. అయితే, ఎమ్మెల్యే సమావేశంపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి.. ఇది మా కుటుంబ సమస్య.. మాకు కుటుంబ పెద్దలు ఉన్నారు.. మేమే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు..
Read Also: Harish Rao: సడెన్ ట్విస్ట్ ఇచ్చిన హరీశ్ రావు.. రైల్వే శాఖపై అసహనం
మాది క్రమశిక్షణ గల పార్టీ అని మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు మంత్రి మల్లారెడ్డి… ఇది ఇంటి సమస్య.. పరిష్కరించుకుంటామన్న ఆయన.. నేను ఎవరితోనూ విబేధాలు పెట్టుకునే రకం కాదన్నారు.. మా మధ్య అంతా సమస్య లేదన్న ఆయన.. నేనే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్తాను.. అవసరం అయితే, వారితో మాట్లాడతానని తెలిపారు.. ఇక, నేను గాంధేయవాదిని.. మా ఇంటి సమస్యను ఎక్కువగా చేసి చూపిస్తున్నారని వాపోయిన ఆయన.. అయినా, పదవులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇస్తారు.. నేను కాదు అని స్పష్టం చేశారు.. కుదిరితే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్తా.. అవసరమైతే ఎమ్మెల్యేలను అందరినీ మా ఇంటికి ఆహ్వానిస్తానన్నారు మంత్రి మల్లారెడ్డి.. కాగా, మంత్రి మల్లారెడ్డి కారణంగా మేడ్చల్ జిల్లాలోని పదవులన్నీ మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.. మార్కెట్ కమిటీ ఛైర్మన్ విషయం కేటీఆర్ వరకు వెళ్లింది.. కానీ, రాత్రికి రాత్రే జీవో పాస్ చేసి భాస్కర్ యాదవ్ అనే వ్యక్తితో ప్రమాణ స్వీకారం చేయించారంటూ ఎమ్మెల్యే మైనంపల్లి ఆరోపిస్తున్నారు.. మల్లారెడ్డి అవకాశం ఇచ్చిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ పదవులు కట్టబెడుతూ పంతం నెగ్గించుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమావేశం కావడం చర్చగా మారింది.