Minister Mallareddy It Raids: మల్లారెడ్డి కొడుకు, కూతురు ఇళ్ళల్లో ఐటీ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని పలువురు రాజకీయనేతలు, వ్యాపారవేత్తలపై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. తాజాగా మంత్రి చామకూర మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లా రెడ్డి కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి పై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి. మంత్రి మల్లారెడ్డి కూతురు, కొడుకు, అల్లుళ్ళ నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. 50 టీమ్స్ సహాయంతో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది.
Read Also:Chhatrapati Shivaji: శివాజీపై గవర్నర్ వ్యాఖ్యల వివాదం.. నితిన్ గడ్కరీ చెక్
Also Read
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు సాగుతున్నాయి. కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మల్లా రెడ్డి యూనివర్సిటీ ,మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టారు రాజశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి.
ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీలు రియల్ ఎస్టేట్ రంగాల్లో మొత్తాన్ని కూడా డైరెక్టర్ గా ఉన్నారు మల్లారెడ్డి అల్లుడు, కుమారుడు. ఐటీ అధికారులు వివిధ పత్రాలు పరిశీలిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి వుంది. కాలేజీల్లో పెద్ద ఎత్తున ట్యాక్స్ లు కట్టలేదని అంటున్నారు.ఢిల్లీ నుంచి ప్రత్యేక టీంలు రానున్నాయి. అయితే, దీనిపై మల్లారెడ్డి, ఆయన బంధువులు ఎవరూ స్పందించలేదు. సోమవారం రాత్రి 8మంది టీం హైదరాబాద్ లోనే వున్నారు. స్థానిక అధికారుల సాయంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు మరికొన్నిచోట్ల పెరిగే అవకాశం వుందని చెబుతున్నారు.
ఇదిలా వుంటే. మల్లా రెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి టర్కీలో వున్నట్టు తెలుస్తోంది. ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో మీడియాను అనుమతించడం లేదు. కొంపల్లి ప్లామ్ మిడోస్ లో జరుగుతున్న సోదాలతో మీడియాను లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదు సెక్యూరిటీ సిబ్బంది.
Read Also: Tues Day Bhakthi tv Live: మంగళవారం ఈ స్తోత్రాలు వింటే..
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!