పీసీసీకి కొత్త నాయకత్వం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నాయి శ్రేణులు. కానీ.. ఆ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇంఛార్జ్ పదవిపై ఉన్న శ్రద్ధ పార్టీపై లేదు. కిందస్థాయి ప్రజాప్రతినిధులు చేజారిపోతున్నా పట్టించుకోవడం లేదట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? మేడ్చల్ కాంగ్రెస్‌లో గ్రూపులదే రాజ్యం! అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువయ్యాయి. ఏ ఎన్నిక జరిగిన తమ వారికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానం మీద…