Shamirpet Police Station : దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో…
Shamirpet: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్‌పై దారుణ సంఘటన జరిగింది. ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, డ్రైవర్ సజీవదహనమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని అరుంధతి నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతి చెందిన చిన్నారులు దుర్గా ప్రసాద్ (11), సుబ్రహ్మణ్యం(8)గా గుర్తించారు పోలీసులు. చిన్నారులు అరుంధతి నగర్ లో వుండే బంధువుల ఇంటికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి ఆడుకునేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి శవాలుగా తేలడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయితే చిన్నారుల కోసం కుటుంబ సభ్యులు వెతకగా…
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదులాబాద్ లో అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో భార్గవ్ యాదవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ లు కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాద ధాటికి తీవ్రంగా గాయపడ్డ భార్గవ్ యాదవ్, వర్షిత్ అక్కడికక్కడే మృతి చెందారు. దినేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. నలుగురిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. Also Read:Chhattisgarh:…
క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై గౌడవెల్లి గ్రామానికి చెందిన సోమేష్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సమస్య ఏదైనా సరే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు అని యువతకు సూచించారు. బెట్టింగ్ భూతాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సజ్జనార్ అవిరామ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. Also Read:FASTag: ఫాస్ట్ ట్యాగ్ వ్యవహారంపై హైకోర్టు…
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత పెడదార్లు పడుతోంది. బెట్టింగ్ మాయలో పడి బంగారం లాంటి భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. బెట్టింగ్ లో పెట్టింది తిరిగి వచ్చుడు దేవుడెరుగు ఉన్నదంతా ఊడ్చుకబోయి రోడ్డున పడుతున్నారు చాలామంది. అప్పులు తీర్చే మార్గం లేక తనువులు చాలిస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బుకోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి…
మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సోమేశ్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమేశ్ తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని తన కొడుకు సోమేశ్ తెల్లవారు 4గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ తెలిపారు. తమ ఇంటి సమీపంలోని గౌడవెల్లిలో రైల్ ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నడన్నారు. లక్షల్లో సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ పెట్టాడని తెలిపారు. గతంలో తమ కూతురు…
కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో నిందితుడు ఎక్కడ ఎక్కాడో వివరాలు సేకరిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో ఎక్కినట్లు అనుమానిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమరాల్లో నిందితుడు కనిపించలేదు.
తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆకర్షితులవుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే, పెద్ద మొత్తంలో నష్టపోయి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది.