హైదరాబాద్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు కుర్రకారు రెచ్చిపోతోంది. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారు యువకులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధి బౌరంపేటలో ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఢీకొంది కారు. దీంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద అర్ధరాత్రి తర్వాత ఘటన జరిగింది. READ ALSO దూసుకొచ్చిన కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారా యువకులు. ప్రమాదానికి…
సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు బండారు హన్మంత్ కోర్టులో లొంగిపోయాడు. ఎల్బీనగర్ కోర్టులో హన్మంత్ లొంగిపోయినట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా హన్మంత్ వున్నాడు. ఇటీవల మేడ్చల్ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రిన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇస్నాపూర్‌లో డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాటున డ్రగ్స్ తయారుచేస్తున్నాడు హన్మంత్ రెడ్డి. నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు బాలానగర్ పోలీసుల…
అసంతృప్త జ్వాలలు తారాస్థాయికి చేరడంతో మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? పాతవాళ్లు వెళ్లిపోతున్నా పార్టీ పెద్దలకు పట్టడం లేదా? ఇంతకీ ఏంటా పార్టీ? మాజీ ఎమ్మెల్యేలు ఎవరు? తలోదిక్కుకు పోతున్న పార్టీ కేడర్..! మేడ్చల్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం.. కేడర్ ఉండేది. అలాంటి జిల్లాలో నేడు ఒక్కో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోతున్నారు. కూన శ్రీశైలం గౌడ్‌తో మొదలైన రాజీనామాల పర్వం ప్రస్తుతం ఆకుల రాజేందర్ దగ్గర ఆగింది. ఉమ్మడి…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో భారీగా మెపిడ్రెన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రూ. రెండు కోట్ల విలువగల డ్రగ్ స్వాధీనం చేసుకోవడంతో నగరం ఉలిక్కిపడింది. 4.92 కేజిలతో పాటు, ఓ కార్ సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురు నిందితులు పవన్,మహేష్ రెడ్డి,రామకృష్ణగౌడ్ ను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితులు ఎస్క్ రెడ్డి, హన్మంత్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు…
ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన ఆ మంత్రికి సొంతపార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారా? జిల్లాస్థాయి కీలక పదవిలో ఉన్న నేత రాజీనామాకు సిద్ధపడ్డారా? ప్రతిపక్ష పార్టీల విషయంలో చేయాల్సిన రాజకీయాలు సొంతపార్టీలో చేసి అధిష్ఠానాన్ని ఇరుకున పెడుతున్నారా? కమిటీల కూర్పుతో మరోసారి భగ్గుమన్న విభేదాలు! టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల కూర్పు.. ప్రకటనలు కొన్నిచోట్ల ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా నేతల రాజీనామాల వరకు వివాదాలు వెళ్తున్నాయి. దీనికి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్‌కేసర్ మండల కమిటీ ఒక ఉదాహరణ. కమిటీ…
ఆ జిల్లాలో అధికారపార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది? ‘గ్రేటర్’ ఎన్నికల తర్వాత మనస్పర్థలతో గ్యాప్ బాగా పెరిగింది. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవిని ఏకగ్రీవం చేయడం ఇష్టంలేక కొత్త ఎత్తులు వేస్తున్నారట. తాజా అరుపుల వెనక అసలు కథ ఏంటి? మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్‌లో తారాస్థాయికి వర్గపోరు! హైదరాబాద్ ASరావునగర్ డివిజన్ టీఆర్ఎస్ సమావేశం రసాభాసగా మారడంతో పార్టీలో వర్గపోరు మరోసారి చర్చగా మారింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్…
ఫేస్ బుక్ ద్వారా ఓయువతిని వలలోకి దింపి, ఫొటోస్ తీసి, ఫొటోస్ తో యువతిని బ్లాక్మెయిల్ చేస్తూ కొద్దికాలంగా డబ్బులు వసూలు చేస్తున్న కిలాడి మొసగాడిని, అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో జరిగింది. బొడుప్పల్ కి చెందిన యువతిని, ఘట్కేసర్ మండలం కొర్రెముళ్ల గ్రామానికి చెందిన సూర్యకాంత్ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా వలలో వేసుకొని, ఆ యువతితో డేటింగ్ సాగిస్తు తనకి తెలియకుండా కొన్ని ప్రయివేట్…
పీసీసీకి కొత్త నాయకత్వం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నాయి శ్రేణులు. కానీ.. ఆ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇంఛార్జ్ పదవిపై ఉన్న శ్రద్ధ పార్టీపై లేదు. కిందస్థాయి ప్రజాప్రతినిధులు చేజారిపోతున్నా పట్టించుకోవడం లేదట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? మేడ్చల్ కాంగ్రెస్‌లో గ్రూపులదే రాజ్యం! అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువయ్యాయి. ఏ ఎన్నిక జరిగిన తమ వారికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానం మీద…