కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో నిందితుడు ఎక్కడ ఎక్కాడో వివరాలు సేకరిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో ఎక్కినట్లు అనుమానిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమరాల్లో నిందితుడు కనిపించలేదు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో మహిళా భోగి నుంచి ఇద్దరు మహిళలు దిగడంతో అందులో బాధిత యువతి ఒంటరిగా మిగిలింది. భోగిలో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితుడు యువతి దగ్గరికి వెళ్లాడు.
READ MORE: Supreme Court : పార్టీ ఫిరాయింపులకు ఏడాది పూర్తి.. సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు
తాజాగా ఎంఎంటీఎస్ లో రోజూ ప్రయాణిస్తున్న యువతి ఎన్టీవీతో మాట్లాడింది. “నేను రోజూ ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తాను. ఈ సంఘటన తరువాత సాయంత్రం ట్రైన్ లో వెళ్ళొద్దని మా పేరెంట్స్ చెప్పారు. అందుకే మధ్యాహ్నంలోపే వెళ్తున్నాను. ఒక్కొక్కసారి మహిళా భోగిలో ఒంటరిగా వెళ్తాను. ఆ టైంలో భయమేస్తోంది. ఇప్పటివరకు నేను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయలేదు కాని, ఈ ఘటన తరువాత భయమేస్తోంది. మహిళా బోగీల్లో ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. లేడీ కానిస్టేబుల్స్ ను బోగీల్లో ఉంచాలి.” అని ఆమె పేర్కొంది.
READ MORE: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్