మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సోమేశ్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమేశ్ తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని తన కొడుకు సోమేశ్ తెల్లవారు 4గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ తెలిపారు. తమ ఇంటి సమీపంలోని గౌడవెల్లిలో రైల్ ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నడన్నారు. లక్షల్లో సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ పెట్టాడని తెలిపారు. గతంలో తమ కూతురు వివాహం కోసం సోమేశ్ అప్పు చేశాడని అప్పు తీర్చామన్నారు.
READ MORE: Telangana Assembly : తెలంగాణలో అసెంబ్లీలో కీలక పరిణామం.. స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
అందరితో బాగానే మాట్లాడాడని.. రాత్రి ఏం జరిగిందో? ఎవరు టార్చర్ చేశారో తెలియదన్నారు. మనోవేదనకు గురై సోమేశ్ సూసైడ్ చేసుకున్నాడని.. తమకు కడుపుకోత మిగిల్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన ఈ అన్యాయం ఎవరి కుటుంబంలో జరగకూడదని ఆ తల్లిదండ్రులు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సోమేశ్ చనిపోయే ముందు స్నేహితులకు వాట్సప్‌లో లొకేషన్ షేర్ చేశాడని.. తామంతా లొకేషన్ కి వెళ్లేసరికి మృతదేహం పడి ఉందని కన్నీరుమున్నీరుగా విలపించారు.
READ MORE: Yashwant Varma: యశ్వంత్ వర్మకు గట్టి ఎదురుదెబ్బ.. అలహాబాద్‌కు బదిలీ వద్దంటూ బార్ అసోసియేషన్ ధర్నా