Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్ లావా విరాట్ కర్వ్ 5జీ సెప్టెంబర్ 21న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ హెరిటేజ్ ఇండోగో, మక్రానా ఐవరీ అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పూర్తి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన 6.67 అంగుళాల త్రీడీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేను అందించారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్‌తో వస్తుంది.
ఫోన్ డిజైన్ పరంగా ముందు, వెనుక భాగాలలో కర్వ్డ్ ప్యానెల్స్ ఉండగా, వెనుక భాగంలో వీగన్ లెథర్ ఫినిషింగ్ ఇచ్చారు. టాప్-లెఫ్ట్ కార్నర్లో రెక్టాంగులర్ కెమెరా మోడ్యూల్ అమర్చబడి ఉంది. ఇది ధూళి, నీటి తుంపరల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో సోనీ ఐఎంఎక్స్752 సెన్సార్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో సెన్సార్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఇందులో ఒక ప్రత్యేకమైన మినీ డిస్ప్లే కూడా ఉంది, ఇది లావా లోగో, వాల్యూమ్ స్థాయి, బ్యాటరీ శాతం, ఎమోజీలు, సమయం లేదా నోటిఫికేషన్లను చూపుతుంది. ఈ ఫోన్ రెండు కే/30 ఎఫ్‌పీఎస్ వరకు వీడియో రికార్డింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పనితీరు కోసం ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్సెట్ వాడారు.
Also Read
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
- OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
- OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
- Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
దీనికి జతగా 6 జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. అదనంగా మరో 6 జీబీ వర్చువల్ రామ్ సపోర్ట్ ద్వారా మొత్తం రామ్‌ను 12 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. కంపెనీ దీనికి రెండు సంవత్సరాల ఓఎస్ అప్గ్రేడ్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని ప్రకటించింది.
ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీని అమర్చారు. ఇది వేగంగా ఛార్జ్ చేసుకోవడానికి 45 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!