తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత పెడదార్లు పడుతోంది. బెట్టింగ్ మాయలో పడి బంగారం లాంటి భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. బెట్టింగ్ లో పెట్టింది తిరిగి వచ్చుడు దేవుడెరుగు ఉన్నదంతా ఊడ్చుకబోయి రోడ్డున పడుతున్నారు చాలామంది. అప్పులు తీర్చే మార్గం లేక తనువులు చాలిస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బుకోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన సోమేష్ క్రికెట్ బెట్టింగ్ లో రూ. 2 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన సోమేష్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుడి చివరి ఫోన్ కాల్ వెలుగులోకి వచ్చింది. సోమేష్ చివరి సంభాషణ ఆవేదన కలిగిస్తోంది.
Also Read:MS Dhoni: కొత్తలో ఆ రూల్ నచ్చలేదు.. ఇప్పటికీ నాకు అవసరం లేదు!
సూసైడ్ చేసుకోవడానికి ముందు సోమేష్ ఫ్రెండ్స్ కి కాల్ చేసి మాట్లాడాడు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని తీవ్ర మనోవేదనలో ఉన్న సోమేష్ తన బాధను స్నేహితులతో పంచుకున్నాడు. గౌడవెల్లి రైలు ట్రాక్ వద్ద సూసైడ్ చేసుకునేందుకు వచ్చాను అంటూ ఫ్రెండ్స్ కి మెసేజ్ చేశాడు సోమేష్. ఫోన్ కాల్స్ లో ఆత్మహత్య చేసుకోకు అంటూ సోమేశ్ కు స్నేహితులు చెప్పారు. డిప్రెషన్ లో ఉన్నానంటూ సోమేష్ ఫ్రెండ్స్ తో అన్నాడు. అప్పు తీరుద్దాం ఇంటికి తిరిగివచ్చేయి అంటూ స్నేహితులు సముదాయించారు.
Also Read:Delhi Capitals: అరంగేట్రం అంటే ఇలా ఉండాలి.. తొలి మ్యాచ్‌లోనే
సూసైడ్ చేసుకుంటే పేరెంట్స్ ఏం కావాలి అంటూ సోమేశ్ ను స్నేహితులు ప్రశ్నించారు. తనకు వెంటనే లక్ష రూపాయలు కావాలంటూ స్నేహితులను కోరాడు. వాట్సాప్ లో చివరిసారిగా సోమేష్ లొకేషన్ షేర్ చేశాడు. వెంటనే ఫ్రెండ్స్ లోకేషన్ కు వెళ్లి చూసేసరికి సోమేష్ మృతి చెందాడు. ఎదిగి వచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.