Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidya Balan: సూపర్‌స్టార్ రజనీకాంత్-నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన హై-వోల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతున్న సీక్వెల్ ‘జైలర్ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పలు భాషలకు చెందిన అగ్ర నటులను రంగంలోకి దించుతూ నెల్సన్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తుండగా, తాజాగా చిత్ర బృందం వదిలిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ఈ ప్రాజెక్ట్‌లోకి పవర్ఫుల్ రోల్‌తో అడుగుపెట్టడమే కాకుండా, ఆమె పాత్ర స్వభావాన్ని చాటిచెప్పే స్పెషల్ ఫస్ట్ లుక్ వీడియో సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో విద్యాబాలన్ ‘కాంత’ అనే అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మెట్లపై నుంచి అత్యంత స్టైలిష్‌గా, ముఖంలో గంభీరమైన రౌద్ర భావాలను ప్రదర్శిస్తూ కిందకు నడుచుకుంటూ వచ్చిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. చివర్లో ఆమె పలికిన పదునైన డైలాగ్ సినిమాపై హైప్‌ను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చింది. కేవలం గ్లామర్ లేదా సపోర్టింగ్ రోల్ కాకుండా, కథను మలుపు తిప్పే నెగెటివ్ లేదా మాస్ డామినేటింగ్ లేడీ క్యారెక్టర్‌గా ఆమె పాత్ర ఉంటుందని వీడియో చూస్తుంటే స్పష్టమవుతోంది. రజనీకాంత్ మార్క్ యాక్షన్‌కు దీటుగా విద్యాబాలన్ తన నటనతో ఢీకొట్టబోతోందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం ఈ ఫస్ట్ లుక్ వీడియోకు ప్రాణంగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేస్తూ ఆయన ఇచ్చిన స్కోర్ విద్యాబాలన్ స్క్రీన్ ఎంట్రీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. మొదటి పార్ట్‌లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి దిగ్గజాలను తీసుకొచ్చి థియేటర్లలో రచ్చ చేసిన నెల్సన్.. ‘జైలర్ 2’ కోసం వివిధ చిత్ర పరిశ్రమల నుంచి మరింత మంది స్టార్లను ఏకం చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు, తమిళ స్టార్ యాక్టర్ ఎస్.జే సూర్యల రోల్ రివీల్ చేశారు. ఇప్పుడు విద్యాబాలన్ ఎంట్రీతో ఈ సినిమాపై హైప్ పీక్స్‌కి చేరింది. రానున్న రోజుల్లో డైరెక్టర్ నెల్సన్ ఇంకా ఎంత మంది స్టార్ట్స్‌ను రివీల్ చేయబోతున్నాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విద్యాబాలన్ ‘కాంత’ ఫస్ట్ లుక్ వీడియో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!