విద్యార్థులకు క్రమశిక్షణ సంస్కారం నేర్పాల్సిన ఫిజికల్ డైరెక్టర్ విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ ఆనంద్ అరాచకం సృష్టించాడు. ఒంట్లో బాగా లేదన్నా వినకుండా 8 మంది విద్యార్థినిలను పీఈటీ చితకబాదాడు. 8వ తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య, చరణ్య, అర్చన, బ్లెస్సీ, కీర్తనలను గేమ్స్ పీరియడ్‌లో ఆటలు ఆడేందుకు విద్యార్థినిలు రాలేదని.. ఏ మాత్రం కనికరం లేకుండా కరెంట్ వైర్‌తో చితకబాదాడు పీఈటీ ఆనంద్..
Read Also: KCR: 3 గంటలు సుదీర్ఘ చర్చలు.. పార్టీ నేతలతో ముగిసిన కేసీఆర్ మీటింగ్
అనంతరం ఇంటికి వచ్చిన విద్యార్థినులకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు గమనించారు. ఒంటి పై గాయాలు చూసి పేరెంట్స్ షాక్‌కు గురయ్యారు. జరిగిన విషయం తెలుసుకొని ఆడపిల్లలపై కరెంట్ వైర్ తో కొట్టడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. స్కూల్ వద్ద గొడవకు దిగారు. కాగా.. తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారని పీఈటీ విషయం తెలుసుకుని స్కూల్‌కు డుమ్మా కొట్టారు. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారి స్పందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
Read Also: PNB SO Recruitment 2025: బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఈ జాబ్స్ మీకోమే.. నెలకు రూ. లక్ష జీతం