మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదులాబాద్ లో అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో భార్గవ్ యాదవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ లు కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాద ధాటికి తీవ్రంగా గాయపడ్డ భార్గవ్ యాదవ్, వర్షిత్ అక్కడికక్కడే మృతి చెందారు. దినేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. నలుగురిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు.
Also Read:Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి
ఎదులాబాద్ నుంచి కుంట్లూరు వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. నలుగురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భార్గవ్ యాదవ్ కుంట్లూరుకి చెందిన వ్యక్తి కాగా, వర్షిత్ సైనిక్ పురి, ప్రవీణ్ ఓల్డ్ అల్వాల్, దినేష్ వైజాక్ కు చెందిన వారు గుర్తించారు పోలీసులు. Accenture సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వీకెండ్ కావడంతో ఎదులాబాద్ లోని విహారి ఫామ్ హౌస్ లో విందు ఏర్పాటు చేసుకున్నారు.
Also Read:Khammam: విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నేత దాడి.!
అర్ధరాత్రి వరకు మద్యం సేవించి అక్కడి నుంచి డిన్నర్ కోసం హోటల్ కి వెళ్లారు. డిన్నర్ చేసుకొని తిరిగి ఫామ్ హౌస్ కు చేరుకునే సమయం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు.