మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని అరుంధతి నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతి చెందిన చిన్నారులు దుర్గా ప్రసాద్ (11), సుబ్రహ్మణ్యం(8)గా గుర్తించారు పోలీసులు. చిన్నారులు అరుంధతి నగర్ లో వుండే బంధువుల ఇంటికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి ఆడుకునేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి శవాలుగా తేలడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయితే చిన్నారుల కోసం కుటుంబ సభ్యులు వెతకగా ఆచూకీ లభించలేదు.
Also Read:Vijay Rupani: భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. ఎయిరిండియా ఘటనలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి..
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చిన్నారుల కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో క్వారీ గుంతవైపు వెళ్లిన కొందరు వ్యక్తులు చిన్నారుల మృతదేహాలు నీటిలో తేలియాడడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులు క్వారి గుంతలో శవాలుగా తేలడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.