Fire Accident: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో బాసరగాడిలో గల కేకేసి ఎలక్ట్రికల్స్ ఫ్యాన్ తయారీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
అయితే, మంటలు వ్యాపించడంతో చుట్టూ పక్కల భారీగా పొగ అలుముకుంది. కానీ, ప్రమాద సంఘటన గురించి తెలిసి కూడా ఇప్పటి వరకు కేకేసీ ఎలక్ట్రికల్స్ ఫ్యాన్ తయారీ పరిశ్రమ యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. వారు రావడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఈ అగ్ని ప్రమాదంపై ఆస్తినష్టం ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.