11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor X9e Pro: హానర్ (Honor) నుండి X సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. Honor X9e Pro పేరుతో వస్తున్న ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 24న మలేషియాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు హానర్ వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ సోషల్ మీడియా ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలను టీజ్ చేస్తోంది.
Honor X9e Proను డాన్ గోల్డ్, మిడ్నైట్ బ్లాక్, రెడ్డిష్ బ్రౌన్, రాయల్ పర్పుల్ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. డిజైన్‌తో పాటు ఫోన్ మన్నికపై కూడా కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కంపెనీ. డిస్ప్లే కూడా ఈ ఫోన్లో మరో ప్రత్యేకతగా నిలవనుంది. స్థానిక నివేదికల ప్రకారం ఇందులోని డిస్ప్లే 10,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అందించగలదు. అయితే ఈ వివరాలను లాంచ్ సమయంలో కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
రెసిస్టెన్స్‌పై ప్రత్యేక ఫోకస్
ఈ రాబోయే మొబైల్ లో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది కంపెనీ. వేడి నీటిలో ఫోన్‌ను ముంచినట్లు కంపెనీ టీజర్లో చూపించింది. ఈ ఫోన్‌కు IP68, IP69, IP69K వంటి రక్షణ రేటింగ్స్ ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే డ్రాప్ ప్రొటెక్షన్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.
108MP కెమెరా
కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో ప్రధాన కెమెరాగా 108MP సెన్సార్ ఉండనున్నట్లు హానర్ ఇప్పటికే ధృవీకరించింది. అయితే రెండో కెమెరాకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు.
11,000mAh బ్యాటరీ
అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఫోన్లో భారీ 11,000mAh బ్యాటరీ ఉండనున్నట్లు సమాచారం. దీనికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించనుంది. ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. సాధారణ మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే 11,000mAh బ్యాటరీ చాలా పెద్దది కావడంతో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఇది ప్రత్యేకంగా నిలవనుంది.
ప్రాసెసర్, ధర
Honor X9e Pro ప్రాసెసర్, డిస్ప్లే పరిమాణం, డిస్ప్లే టెక్నాలజీ, ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు, ధర వంటి పూర్తి వివరాలను కంపెనీ అధికారిక లాంచ్ ఈవెంట్లో వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ మలేషియా మార్కెట్లో సెప్టెంబర్ 24న విడుదల కానుంది,. ఇతర దేశాల్లో ఈ ఫోన్‌ను ఎప్పుడు తీసుకొస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!