ఉమ్మడి మెదక్ జిల్లా వెంకటాపూర్ వద్ద జరిగిన కారు చోరీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. కారు చోరీ కేసులో మృతుడు సచివాలయ ఉద్యోగి ధర్మ కాదని పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ధర్మను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ సమీపంలో కారులో కాలిపోయిన మృతదేహం లభ్యమైంది.
వైద్యంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. చివరి స్థానంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్ అంటూ మండిపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం, ఎక్కడ చూసినా సందడే సందడి. రాజకీయ పార్టీలు తాయిలాలు ప్రకటిస్తున్న వేల మునుగోడులాగే ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని, అలా చేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఓటర్లు ఎమ్మెల్యేల మీద వత్తిడి చేస్తున్నారు.
Chegunta: మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివునూరు గ్రామస్తులు దీపావళి నుంచి భయాందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. పండగరోజు నుంచి 70మందికి పైగా గ్రామస్తులకు వాంతు, విరేచనాలు అవుతున్నాయి.
ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్, కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా నగర పరిసరాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం పూట పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.