ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్, కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా నగర పరిసరాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం పూట పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. వినాయక చవితి రోజున అపశృతి చోటు చేసుకుంది. గణేష్ మండపం కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యార్థికి కరెంట్ షాక్ తగలడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి సాయిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వినాయక చవితి సందర్భంగా మెదక్ జిల్లా టెక్మాల్ మండలం పాపన్న పేట గురుకుల పాఠశాలలో గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు…
ప్రేమ పేరుతో యువత వారి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. కుటుంబం గురించి ఆలోచించకుండా వారి జీవితాన్ని వారే కడతేర్చకునే దుస్థితికి పాల్పడుతున్నారు. ప్రేమలో పడిన వారికి కుటుంబంతో పని లేకుండా పోతోంది. ప్రేమలో వున్న వారికి అంతా ప్రేమికులే జీవితంగా భావిస్తున్నారు. అదే ప్రేమ విఫలమైతే వారితో జీవించలేని బతుకు ఎందుకంటూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారు మృతి చెందితే వారి ప్రేమించిన వ్యక్తి ఏమోగానీ.. మృతి చెందిన కుటుంబం ఏమవుతుందనే ఆలోచన కూడా లేకుండా పోతోంది ఈకాలం…
తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ అన్నారు. మెదక్ జిల్లాలో శనివారం ఉదయం కేంద్రమంత్రి గెస్ట్హౌజ్కు వచ్చినప్పటీకీ ఆర్అండ్బీ అధికారులు తాళం తీయని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్రంలో, దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పథకాలు తెలంగాణలో అమలు చేయడం…
బాయ్.. బాయ్.. అమ్మా స్కూల్ కి వెళ్లొస్తా.. అంటూ ఇంటి నుంచి వెళ్లారు ఆ చిన్నారు. జాగ్రత్త నాన్న అంటూ పంపించింది తల్లి. కానీ.. అదే చివరి చూపు అవుతుంది అనుకోలేదు ఆతల్లి. కాసేపటికే చిన్నారుల మృత్యువాత పడినట్లు తెలియగానే గుండెలు బాదుకుంటూ స్కూలు కు పరుగులు పెట్టింది. ఆచిన్నారులను చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆతల్లిని చూసిన వారందరికి కన్నీరు ఆగలేదు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ముగిశాక.. సమీపంలోని ఓ నీటిగుంత దగ్గరికెళ్లిన ఇద్దరు విద్యార్థులు…
దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లోని HDFC వినియోగదారుల ఖాతాల్లో ఇంకా జమవుతూనే వున్నాయి కోట్లాది రూపాయలు. తాజాగా మెదక్ కి చెందిన వ్యక్తి బ్యాంకు అకౌంట్ లో లక్ష కాదు.. కోటి కాదు ఏకంగా రూ.9.61 కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యాయి. ఖాతాలో రూ.9.61 కోట్లు జమ అయినట్లు మెసేజ్ రావడంతో… నిజమా? కాదా? అనే అనుమానంతో రూ.4.97 లక్షలను మరో ఖాతాకు బదిలీ చేశాడు నరేందర్. ఇంకేముంది.. తనకున్న క్రెడిట్ కార్డ్ బిల్ రూ.1.42 లక్షల…