ఉమ్మడి మెదక్ జిల్లా వెంకటాపూర్ వద్ద జరిగిన కారు చోరీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. కారు చోరీ కేసులో మృతుడు సచివాలయ ఉద్యోగి ధర్మ కాదని పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ధర్మను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ సమీపంలో కారులో కాలిపోయిన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన ప్రమాదమా లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో పెట్రోల్ బాటిల్ లభ్యమైంది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో దిమ్మతిరికే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read also: Father Lust on Daughter: ఛీ..ఛీ.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం.. గర్భం దాల్చడంతో..
సచివాలయ ఉద్యోగి ధర్మానాయక్ ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ లో రూ. 2 కోట్లు అప్పులు చేశాడు. ధర్మాకు రెండుకోట్ల అప్పులు ఎలా తీర్చాలని భయం పట్టుకుంది. చివరికి ఓ.. ఐడియా మైండ్ లో మొదలైంది. చనిపోయినట్లు నటిస్తే రూ. బీమా సొమ్ము రూ.7 కోట్లు అవుతుంది. దీంతో అప్పులు తీర్చవచ్చని ధర్మానాయక్ భావించాడు. ఈ నెల 9న కారు చోరీ కేసులో ధర్మానాయక్ మృతి చెందినట్లుగా డ్రామా ఆడారు. ఈ నెల 5న హైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని స్వగ్రామానికి బయలుదేరాడు. కుటుంబ సభ్యులను ఇంటి వద్ద వదిలిపెట్టాడు. పనికి వెళుతున్నానని చెప్పిన ధర్మానాయక్ ఇంట్లో కాలిపోయిన స్థితిలో కనిపించాడు. ఉమ్మడి మెదక్ జిల్లా భీమ్‌లతండాకు చెందిన ధర్మానాయక్ కారు చోరీ కేసును పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పెట్రోల్ బాటిల్ లభ్యమైంది. పెట్రోల్ బాటిల్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
Read also: Minister Errabelli: ఆ..ఎమ్మెల్యేలను మారిస్తే100 సీట్లు గ్యారెంటీ.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు..
ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. ధర్మానాయక్ కారులో మృతదేహం ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ధర్మానాయక్ తన భార్యకు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని భీమా కంపెనీకి సమర్పించాలని కోరినట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ జరిపితే ధర్మానాయక్ పూణేలో ఉన్నట్లు తేలింది. ధర్మానాయక్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కారులో లభ్యమైన మృతదేహానికి ధర్మానాయక్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ధర్మానాయక్ కారులో మృతదేహం ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ధర్మానాయక్ చనిపోయినట్లు నటించిన డ్రామా కుటుంబ సభ్యులకు తెలుసా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు దగ్ధమైన ఘటన వెలుగులోకి వచ్చిన రోజున కారులో మృతదేహం ధర్మానాయక్‌దేనని చెప్పిన వారిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్త? అప్పట్లో సంచలనం