సిద్దిపేట మాజీ కలెక్టర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వెంకట్రామిరెడ్డి జాయింట్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా మల్లన్న సాగర్, కొకపేట, కొల్లూరు ,జహీరాబాద్ భూముల పేరు మీద దండిగా దోపిడీ చేసాడని ఆరోపణలు చేశారు. ఆ పైసలు వెంకట్రామిరెడ్డి దగ్గర ఉన్నాయి కనుకే ఎమ్మెల్సీ ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు మెదక్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఇంచార్జి గా వెంకట్రామిరెడ్డికి వచ్చారని తెలిపారు. వెంకట్రామిరెడ్డి ఏమి పాలు…
మెదక్ పార్లమెంట్ టీడీపీ కమిటీ సమావేశానికి హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిన నరసింహులు అధికార టీఆర్‌ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాన్నారు. కేసీఆర్ తెలంగాణ రాదనుకుని దళితుడిని సీఎం చేస్తానని అన్నారన్నారు. సీఎం ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నాడని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు. అంటరాని తనాన్ని రూపు మాపిన వ్యక్తి ఎన్టీఆర్ అని, త్వరలోనే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని…
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో.. వాగులు వంకలు, ప్రాజెక్లులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి… ఎగువన కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తివేశారు అధికారులు… సింగూరు ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేయడంతో.. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో.. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది… ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. ఉత్సవ విగ్రహానికి గోపురం వద్ద పూజలు నిర్వహించారు.. ఆలయ ప్రాంగణంలో..…
మెదక్ కొల్చారంలో ఐఎంఎల్ ( మద్యం స్టోరేజ్ సెంటర్) కి బీరు బాటిల్స్ తీసుకొస్తున్న లారీని దొంగలించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో బీర్ ఫ్యాక్టరీ లో కార్టన్లను లారీ లో లోడ్ చేసారు. అక్కడి నుండి కొల్చారం మండలం చిన్న ఘనపూర్ డిపోలో లోడ్ ను దింపేందుకు లారీ వచ్చింది. కానీ అక్కడ వరుసగా లారీల క్యూ ఉండడంతో డ్రైవర్ ఇంటికి వెళ్ళాడు. సమయం చూసుకొని లారీతో సహా బీర్లను తీసుకుని వెళ్లి పోయారు దొంగలు.…
ఆయనో అధికారపార్టీ ఎంపీ. లోక్‌సభ సభ్యుడిగా ఉండి బోర్ కొట్టిందో ఏమో కొత్తగా ఆలోచిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పార్టీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు టాక్. సమయం చిక్కితే ఆ నియోజకవర్గంలో వాలిపోతున్నారట. ‘హలో.. బాగున్నారా?’ అని కనిపించినవారందరినీ కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏంటా నియోజకవర్గం? వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలనే పట్టుదలతో ఉన్నారా? కొత్త ప్రభాకర్‌రెడ్డి. మెదక్ టీఆర్‌ఎస్ ఎంపీ. 2014లో మెదక్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎం.పీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా మొక్కలు నాటాలని తన…