ఓ మహిళ అవసరాన్ని అవకాశంగా తీసుకున్నాడో పై అధికారి.. ఆమెకు కావాల్సిన సంతకం పెడుతానన్నాడు.. కానీ.. ఓసారి మీ ఇంటికి వస్తా.. నా కోరిక తీర్చు అనడంతో ఖంగుతిన్న ఆమహిళ కొండంత బాధతో పై అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో మార్చి 30న జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘పని, బిల్లులిచ్చే విషయంలో నిన్ను ఏడాదికాలంగా ఇబ్బంది పెట్టాను. అదంతా మరిచిపో. నిన్ను ఉద్యోగంలో కొనసాగించే దస్త్రం మీద సంతకం చేస్తా. నువ్వు…
వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ పైనా వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది లేదన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని వాళ్ల పార్టీ వాళ్లే అంటున్నారని అన్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దొంగని పార్టీ చీఫ్ గా పెడితే ప్రజలు నమ్మరని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముందు…
తెలంగాణలో రెండు ఘటనలు రాజకీయంగా ప్రకంపనలు కలిగిస్తున్నాయి. భువనగిరిలో హోంగార్డు రామకృష్ణ కిడ్నాప్, హత్య కలకలం రేపగా.. కామారెడ్డిలో తల్లీ, కుమారుడు ఆత్మాహుతి కేసు. దీనిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారని 306 సెక్షన్ కింద ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు ప్రత్యేక విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డిని నియమించారు. ఈ కేసులో ఏ-1గా రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఏ-2గా సరాఫ్ యాదగిరి, ఏ-3 గా…
తొందరపడి కోయిల ముందే కూసినట్టుగా ఆయన తీరు ఉందా? అక్కడ నుంచి పోటీ చేయాలని తెగ ఉబలాట పడుతున్నారా? ఇది ఆయనకు వచ్చిన ఆలోచనేనా లేక.. పార్టీ చెప్పిందా? అన్నింటికీ సిద్ధపడే మాట్లాడేస్తున్నారా? ఇంతకీ ఎవరా నాయకుడు? గజ్వేల్‌లో వంటేరు ప్రతాప్‌రెడ్డి తీరుపై చర్చతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అసెంబ్లీలో 100కు పైగా శాసనసభ్యుల బలం ఉంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆశావహులు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్…
మెతుకుసీమగా పేరున్న మెదక్ తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో అనూహ్య అభివృద్ధి సాధించిందని అన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మెదక్ జిల్లా అభివృద్ధివైపు అడుగులు వేస్తోందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి చెందని మెదక్ నియోజకవర్గం, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు అన్నారు. మెదక్ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి…
ఒక ఆలయం. ఇద్దరు ఈవోలు. పోస్ట్ ఒకటే అయినా.. ఇద్దరు అధికారుల మధ్య కుర్చీలాట రసవత్తరంగా మారింది. ఎవరి మాట వినాలో సిబ్బందికి తెలియదు. వినకపోతే ఏమౌతుందో తెలియంది కాదు. ఆధిపత్యం కోసం ఇద్దరు ఈవోలు వేస్తున్న ఎత్తుగడలతో ఆ ఆలయం ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. జోనల్ విధానంలో బదిలీపై ఈవోగా వచ్చిన రవికుమార్మెదక్ జిల్లాలోప్రసిద్ధ ఆలయం ఏడుపాయల. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు వస్తారు. ఈ ఆలయంలో ఉన్న ఈవో పోస్ట్ ఒక్కటే…
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆమె హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తమతో సన్నిహితంగా ఉన్న వారు కొవిడ్ నిర్థారణ పరీక్షలు చేసుకోవాలని పద్మాదేవేందర్ సూచించారు. మరోవైపు వేగంగా వ్యాపించే వ్యాపించే ఒమిక్రాన్ ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వేరియంట్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇంకా కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. Read Also: ఊర్లకు వెళ్లే వారి కోసం బస్సు పాయింట్లను…
సిద్ధిపేటలో మంత్రి హరిష్ రావు తడి చెత్తతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ర్టంలో తొలిసారి ఈ తరహా ప్లాంట్‌ను సిద్ధిపేటలోనే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తడిచెత్త నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. తడిచెత్తలో వచ్చే సూదులు, శానిటరీ ప్యాడ్లు, ఔషధ వ్యర్థాల దహనానికి ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. స్థానికంగా యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. సిద్ధిపేటను అన్ని…
హైద్రాబాద్ నగరం చుట్టూ రీజీనల్ రింగురోడ్డు (RRR) నిర్మాణానికి మరో ముందడుగు పడింది. తొలిదశ నిర్మాణం కోసం భూ సేకరణను ప్రారంభించింది. దీనిపై కేంద్రం భూసేకరణ ప్రక్రియను చేపట్టాల్సిందిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్ మీదుగా నిర్మించే ఈ మార్గానికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. వచ్చే 25-30 ఏళ్ల ట్రాఫిక్ అంచనాల మేరకు దీన్ని నిర్మించ…