Harish Rao: వైద్యంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. చివరి స్థానంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్ అంటూ మండిపడ్డారు. పేదలకు ఎలాంటి లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో 58 టిఫా ప్రారంభం అవుతుందని గుర్తు చేశారు. ఈ నెలలో 2000 పల్లె దవాఖానలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోబోతున్నామని ఆనందం వ్యక్తం చేశారు హరీశ్ రావు. తెలంగాణ వచ్చిన నాడు 5 మెడికల్ కాలేజ్ లు ఉంటే, ఇప్పుడు 17 కు పెరిగాయని గుర్తు చేశారు. కరోనా తర్వాత వేయిటేజే ఇస్తున్నామని, ఒక ఏడాదికి 2 మార్కులు కలుపుతున్నామని తెలిపారు. మొదటి ఎ.ఎన్.ఎం. ఖాళీలు ఉన్నాయని, నెలా రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామని శుభవార్త చెప్పారు మంత్రి హరీశ్ రావు.
Read also: Rajamouli, Mahesh Movie Update: మహేశ్‌తో తీసే సినిమా స్టోరీ లైన్ ఇదేనన్న రాజమౌళి
బ్యాంకులో లోన్లు తీసుకుని చాలాకాలంగా కట్టని రైతుల కోసం వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశాన్ని ఇస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నిన్న (శనివారం) ఆయన సిద్దిపేట జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారులు, జిల్లాకె చెందిన ప్రజాప్రతినిధులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. దీని వల్ల జిల్లాలోని 12 వేల మంది రైతులకు మేలు కలుగుతుందన్నారు. జిల్లా బ్యాంకర్లతో మాట్లాడగా.. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఏపీజీవీబీ వన్ టైమ్ సెటిల్మెంట్ కల్పించేందుకు ముందుకొచ్చాయన్నారు. పాత, మొండి బకాయిలున్న రైతులు సెటిల్మెంట్ చేసుకోవాలని, దీనివల్ల కొత్తగా లోన్లు తీసుకునే చాన్సు ఉంటుందన్నారు. మొండి బకాయిల లిస్ట్ లను ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఏంపీటీసీలు, ఏంపీపీలు, అధికారులకు త్వరలోనే అందజేయనున్నారు.