రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు (మంగళవారం) సాయంత్రం కొల్చారం మండలానికి చెందిన యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టారు.
Medak: వినాయక చవితి రోజు ఓ బస్సు కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి మందలించడంతో మనస్తాపం చెంది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో చోటుచేసుకుంది.
కాంగ్రెస్ వాళ్లు ధరణి తీసేస్తాం అంటున్నారు.. ధరణి తీసేస్తే రైతుల అధికారం పోతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ధరణి ఉంటే మీ భూమిని సీఎం కూడా మార్చలేడు.. తీసేస్తే అధికారుల దగ్గర పోతుంది.. ధరణి పోతే పెద్ద పాము మింగినట్టు అయితదని కేసీఆర్ చెప్పారు.
మెదక్ జిల్లా కావాలి అనేది దశాబ్దాల కల అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందిరా గాంధీ మాట ఇచ్చి తప్పారు.. కేసీఆర్ జిల్లా చేసి చూపించారు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి తిట్ల పురాణం.. మీరు తిట్లలో పోటీ పడితే మేం పంట పండించే పనిలో బిజీగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటగా జిల్లాకు చేరుకున్న కేసీఆర్ ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆయనను ఆశీర్వదించారు.
మెదక్ జిల్లాలో జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తను, తన చెల్లి హత్య చేసేందుకు అక్క సుపారీ ఇచ్చి హత్య చేయించిన దారుణ ఘటన మెదక్ జిల్లాలోని హత్నూర మండలం షేర్ఖాన్పల్లిలో చోటుచేసుకుంది.
ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. అనే చందంగా మారింది ప్రస్తుత ధరలు చూస్తుంటే.. సామాన్యుడి బ్రతుకే ప్రశ్నార్థంగా మారింది. కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. టమాటా, పచ్చిమిర్చి ధర ఎన్నడూ లేనంత పెరిగాయి.
BJP Nirudyoga march: నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీజేపీ శ్రేణులు “నిరుద్యోగ యాత్ర” నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఈటల, విజయశాంతి, రఘునందన్ రావు, రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొంటారు.