ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకంపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. 10 మంది పోలీసుల మరణించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్నాయి. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు బుధవారం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొని తిరిగి వస్తున్న 10 మంది భద్రతా సిబ్బందితో పాటు డ్రైవర్‌తో కూడిన వాహనాన్ని పేల్చివేశారు.
Maoists Letter : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. సుక్మా జిల్లాలోని జాగర్‌గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు.
Maoists warning letter to Congress: మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చెబుతూ చత్తీస్ ఘడ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి మోహన్ పేరుతో లేఖను విడుదల చేశారు. చత్తీస్ ఘడ్ లో సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించింది మావోయిస్టు…
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఫిబ్రవరి 10న బీహార్‌లోని భాగల్‌పూర్ పర్యటనకు ముందు ఐఎస్‌ఐ, నక్సలైట్లు, ఛాందసవాదుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ తెలిపారు.
ఒకప్పుడు తన చేతుల్లో రైఫిల్ పట్టుకున్న తర్వాత, కరణ్ హేమ్లా ఇప్పుడు పెన్ను పట్టుకుని మంచి భవిష్యత్తు కోసం ఛత్తీస్‌గఢ్‌లో పదోతరగతి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. 2005లో బస్తర్ డివిజన్లో నక్సల్స్ వ్యతిరేక ఉద్యమం 'సల్వా జుడుం' ప్రారంభం కావడంతో హింస చెలరేగడంతో కరణ్ హేమ్లా చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం పొరుగున ఉన్న మహారాష్ట్రకు చెందిన సీ-60 కమాండోలతో సహా భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు మావోయిస్టులలో డివిజనల్ కమిటీ-ర్యాంక్ మావోయిస్ట్ తలపై కనీసం రూ. 21 లక్షల రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.