Amit Shah: నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తుందని కేంద్రం హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోల సంఖ్య 29కి చేరింది. ఛోట్‌బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా, కరోనార్ మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో.. పోలీసులు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరగగా.. 29 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో 25 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ కమాండర్ శంకర్…
తెలంగాణ ఛత్తీస్‌గడ్ బార్డర్ లో జరిగిన ఎన్‌కౌంటర్ పైనా మరో లేఖ ను విడుదల చేశారు మావోయిస్టులు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ నెల 6 వ తేదీన తెలంగాణ ఛత్తీస్ ఘడ్ బార్డర్ లో ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టు మృతి చెందిన ఘటనను తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యాకాండలు నరహంతక దాడిగా అభివర్ణించారు జగన్. ఈ ముగ్గురు హత్యలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో కనీసం నలుగురు అనుమానిత మావోయిస్టులు, వారిలో ఇద్దరు నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) సభ్యులు మరణించారని పోలీసులు తెలిపారు. గడ్చిరోలి జిల్లాకు 400 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ సరిహద్దులో ఉన్న కొలమార్క పర్వతాలలో దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఎన్‌కౌంటర్ జరిగింది. మృతి చెందిన మావోయిస్టులపై రూ. 36 లక్షల సామూహిక రివార్డు ఉందని గడ్చిరోలి, నీలోత్పాల్ పోలీసు సూపరింటెండెంట్ (SP) తెలిపారు. గడ్చిరోలిలో అనుమానిత…
4 Naxals killed in encounter with police in Gadchiroli: తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Also Read: Sarfaraz-Dhruv Jurel: సర్ఫరాజ్ ఖాన్,…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రమాదం పొంచిఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది.. దీంతో.. సీఎం కోసం రెండు హెలీకాప్టర్లు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.. సీఎం జగన్ పర్యటనల నిమిత్తం రెండు ప్రత్యేక హెలీకాప్టర్లను రెడీ చేస్తున్నారు.. విజయవాడ, విశాఖల్లో రెండు హెలీకాప్టర్లను అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం
ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని టేకల్గూడెం గ్రామంలో మంగళవారం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఓ ఆరు నెలల చిన్నారి మరణించింది. అంతేకాకుండా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన తల్లి ముట్వాండి గ్రామానికి చెందిన నివాసి. ఇదిలా ఉంటే.. ఈ కాల్పుల్లో ఇద్దరు జిల్లా రిజర్వ్ గార్డ్ జవాన్లు కూడా గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు.