Maoists warning letter to Congress: మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చెబుతూ చత్తీస్ ఘడ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి మోహన్ పేరుతో లేఖను విడుదల చేశారు. చత్తీస్ ఘడ్ లో సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించింది మావోయిస్టు పార్టీ.
Read Also: Parliament: 12 మంది ప్రతిపక్ష ఎంపీలపై చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ సీరియస్
2018 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో పెట్టిన హామీలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని.. నిరుద్యోగం, మద్యనిషేధం, నిరుద్యోగ భృతి, అంగన్ వాడీ కార్యకర్తలకు జీతాల పెంపు డిమాండ్లను నెరవేర్చడం లేదని విమర్శించింది. బస్తర్ ప్రాంతంలో భద్రతా శిబిరాలను తెరిచి కంటోన్మెంట్లుగా మార్చారని.. తమ డిమాండ్ల కోసం శాతంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై లాఠీచార్జీలు చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో 2500 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ దాన్నీ నెలకు రూ. 1000కి తగ్గించారంటూ ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో బఘేల్ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యాయని లేఖలో ఆరోపించారు.
2013లో మావోయిస్టులు కాంగ్రెస్ నాయకులు వాహనాలపై దాడి చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ కీలక నేత మహేంద్ర కర్మతో పాటు 25 మంది వరకు కాంగ్రెస్ నేతలు మరణించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. ఇదిలా ఉంటే ఈ ఏడాది చత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరోసారి రాష్ట్రంలో అధకారంలోకి రావాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ ను అధికారానికి దూరం చేయాలని భావిస్తోంది.