Chhattisgarh BJP Leader Neelkanth Nakkem Hacked To Death By Maoists: మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ బీజేపీ నాయకున్ని అత్యంత దారుణంగా హతమార్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన బీజేపీ నాయకుడు నీల్‌కంఠ్ నక్కెంను కిరాతకంగా చంపేశారు. గత 15 ఏళ్లుగా ఉసూర్ బ్లాక్‌కి బీజేపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న నీల్‌కంఠ్.. తన స్వగ్రామమైన పైక్రమ్‌లో బంధువు వివాహానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని, నీల్‌కంఠ్‌పై ఎగబడ్డారు. మొత్తం 150 మంది గుంపుగా పైక్రమ్‌కి చేరుకున్నారు కానీ, వారిలో ముగ్గురు మాత్రమే నీల్‌కంఠ్‌పై దాడి చేసి చంపారు. కుటుంబ సభ్యుల ముందే కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. సాధారణ దుస్తుల్లో వచ్చిన ఆ మావోయిస్టులు.. ఇంట్లో నుంచి లాక్కెళ్లి మరీ, ఆ బీజేపీ నాయకుడ్ని చంపారు. అవపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Bihar Railway Track: బిహార్‌లో మరో వింత ఘటన.. రైల్వే ట్రాక్ దొంగలించిన దుండగులు
ఈ ఘటనపై అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ గవర్న మాట్లాడుతూ.. ‘‘నిషేధిత సీపీఐ (ఎం) సాయుధ కార్యకర్తలు నీల్‌కంఠ్‌పై గొడ్డళ్లు, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నీల్‌కంఠ్.. అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిసింది’’ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. మొత్తం 150 మంది మావోయిస్టులు ఆయుధాలతో వచ్చారని, కానీ ముగ్గురు మాత్రమే ఆ బీజేపీ నాయకుడి ఇంటికి చేరుకోగలిగారని తెలిసిందన్నారు. సాధారణ దుస్తుల్లో మావోయిస్టులు రావడంతో, వారిని గుర్తించడం కష్టమైందన్నారు. అవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక సివిలియన్‌ని సైతం మావోయిస్టులు చంపినట్టు తమకు సమాచారం అందిందన్నారు. ఇదే సమయంలో నీల్‌కంఠ్ భార్య లలిత నక్కెం మాట్లాడుతూ.. తన భర్తను కొందరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి, కుటుంబ సభ్యుల & గ్రామస్థుల ముందే ఆయనపై దారుణంగా దాడి చేశారన్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారన్నారు.
Girl Bites Man Lips: అత్యాచారయత్నం.. తెగేలా పెదవి కొరికి, బుద్ధి చెప్పిన యువతి