సింగరేణి ఎన్నికలను బహిష్కరిచాలంటూ కార్మికులకు పిలుపునిస్తూ మావోయిస్టుల విడుదల చేసిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు అనుమతించిన అనంతరం మావోయిస్టు పార్టీ సింగరేణి కార్మిక సమఖ్య (సికాస) కార్యదర్శి ప్రభాత్ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది. సింగరేణి ఎన్నికలను బహిష్కరించాలని లేదంటే TBGKS నాయకులకు శిక్ష తప్పదంటూ లేఖలో హెచ్చరించారు. ‘పోరాటల ద్వారానే హక్కులు సాధించుకోవాలి. కార్మిక…
మావోయిస్టులు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మావోల పేరుతో లేఖలు కనిపించాయి. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిల పేర్లు ప్రస్తావిస్తూ లేఖలు వైరల్ అవుతున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలనకు పెనుముప్పు తప్పింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల భారీ డంపును ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిరిమితి, తులసి అటవీ ప్రాంతంలో భారీ డంప్ బయటపడింది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. బీజేపీ నేతను మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రతన్ దూబ బీజేపీ నారాయణపూర్ జిల్లా విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శనివారం రోజు జిల్లాలోని కౌశల్నార్ ప్రాంతంలో రతన్ దూబేను మావోయిస్టులు చంపేవారు. ఆయన జిల్లా పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Telangana: ప్రజల క్షేమమే మా ధ్యేయం అనే నినాదంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. తేడా వస్తే ప్రాణాలు తియ్యడానికి కూడా ఆలోచించని మావోయిస్టులను చూస్తే ఎవరైనా భయపడాల్సిదే. ఎందుకంటే వాళ్లకు ఏదైనా తప్పుగా అనిపిస్తే సింపుల్ గా చంపేస్తారు. తెలంగాణలో మావోయిస్టుల మనుగడ దశాబ్దాలుగా కొనసుగుతూనే ఉంది. వీళ్ళకి పేద ప్రజల ఆదరణ కూడా ఎల్లవేళలా ఉంటుంది. అయితే ఎప్పుడూ జనారణ్యానికి దూరంగా ఉంటారు. కార్యకలాపాలన్నీ అడవుల్లో ఉండే జరుపుతుంటారు మావోయిస్థులు. అయితే తాజాగా సిద్ధిపేటలో మావోయిస్థులు ప్రదర్శించిన…
ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లా ఏక్వారీ అడవుల్లో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో పోలీసులు ఓ నక్సలైట్ ను హతం చేశారు. గంటల తరబడి ఈ కాల్పులు కొనసాగాయి. మరోవైపు ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు రైఫిళ్లు, మావోయిస్టులు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ స్థలంలో మృతదేహాలు ఏవీ కనుగొనబడనప్పటికీ దాదాపు నాలుగు నుంచి ఆరుగురు నక్సలైట్లు మరణించారని సమాచారం.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలో నక్సల్స్, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం బీజాపూర్ జిల్లాలోని బాసగూడ-పామెడ్-యూసర్ ట్రై జంక్షన్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని ఐజీ బస్తర్, పి సుందర్రాజ్ వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి పేలుడు పదార్ధాలను, ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు మావోయిస్టులు తమ తలపై రూ.11 లక్షల నజరానాను కలిగి ఉన్నారని ఆయన చెప్పారు.