Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలో నక్సల్స్, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం బీజాపూర్ జిల్లాలోని బాసగూడ-పామెడ్-యూసర్ ట్రై జంక్షన్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని ఐజీ బస్తర్, పి సుందర్‌రాజ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్ లో సీఆర్పీఎఫ్, స్పెషయ్ యాక్షన్ ఫోర్స్, కోబ్రా బలగాలు పాలుపంచుకున్నాయి. ప్రస్తుతం భద్రతా బలగాలకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని, నక్సల్స్ కు ఎంత నష్టం జరిగిందనే వివరాలు సెర్చ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాతే తెలుస్తుందని ఆయన సుందర్ రాజ్ అన్నారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Read Also: Jeevandan Swarnalatha: దేశవ్యాప్తంగా అవయవదానంలో తెలంగాణ రాష్ట్రమే టాప్
అంతకు ముందు జూన్ 5న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 24 హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న నక్సలైట్ ని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. సిఆర్‌పిఎఫ్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) యూనిట్ (కోబ్రా) యూనిట్‌కు చెందిన 201వ బెటాలియన్‌కు చెందిన సంయుక్త బృందం జాగర్‌గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్పన్‌గూడ గ్రామ అటవీ ప్రాంతంలో సోది దేవా అలియాస్ సునీల్‌ను పట్టుకున్నట్లు సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు.
ప్రస్తుతం ఎన్ కౌంటర్ జరుగుతున్న బీజాపూర్ జిల్లా తెలంగాణను అనుకుని ఉంటుంది. బీజాపూర్ జిల్లా మావోయిస్టులకు మంచి పట్టున్న ప్రాంతం. తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు జిల్లాలను అనుకుని బీజాపూర్ ఉంటుంది. ఈ జిల్లాలను గోదావరి, ఇంద్రావతి నదులు వేరు చేస్తుంటాయి.