అల్లూరి జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లోని బలిమెల రిజర్వాయర్ అటవీ ప్రాంతంలోని తాయిమాల వద్ద మావోయిస్టుల డంపు స్వాధీనం అయింది. బిఎస్ఎఫ్ జవాన్ల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు నిర్వహిస్తున్న బలగాలకు లారీగూడ, తాయిమాల అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్ ఉన్నట్టు తెలిసింది.
Read Also: Illicit Relationship : నా భార్య డ్రైవర్తో పారిపోయింది.. స్టేషన్లో ఫిర్యాదు
దీంతో అక్కడ జల్లెడ పట్టగా డంప్ కనిపించింది. మావోయిస్టులు దాచిపెట్టిన డంపులో లభ్య మైన 3 స్టీల్ ఐడి టిఫిన్ బాంబులు, రెండు ఎస్బిఎంఎల్ తుపాకీలు ,11 గ్రేనేడ్లు, 28 డిటెనేటర్లు ఒక ఇన్సాస్ తుపాకీ మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు. ఆప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. మావోయిస్టులు మళ్ళీ పంజా విసరడానికే ఈ డంప్ సిద్ధం చేశారని అనుమానిస్తున్నారు.
Read Also: Farooq Abdullah: రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు.. అందరివాడు..