దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 88 స్థానాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. సెకండ్ విడతలో 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో మాయవతి పార్టీకి చెందిన బీఎస్పీ అభ్యర్థి మృతిచెందడంతో పోలింగ్ షెడ్యూల్‌ను మార్చారు.
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంఫాల్‌లో అమిత్ షా ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు ప్రారంభమయ్యాయి. కంగ్‌పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామంలో కుకీ, మోతీ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కము సైచాంగ్ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.
ఎన్నికల సమయంలో కనిపించే హడావుడి మణిపుర్‌లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక, ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులు మాత్రమే కనిపిస్తున్నాయి.
మణిపూర్‌లో (Manipur) అధికారుల కిడ్నాప్‌ల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరొక ఆర్మీ అధికారి కిడ్నాప్‌కు గురయ్యారు. మణిపూర్‌లో ఇది నాల్గో సంఘటన కావడం విశేషం.
మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి జీవానం సాగిస్తున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు మణిపూర్‌కు చెందిన వివిధ గిరిజన సంస్థల ప్రతినిధి బృందం నేడు ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో పాటు హోం మంత్రిత్వ శాఖ అధికారులను కలవనున్నారు.
దక్షిణ మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఒకరు కాల్పులకు పాల్పడ్డాడు. తన సహచరులపై కాల్పులు జరపగా.. ఆరుగురు గాయపడ్డారు. ఆపై ఆ జవాన్ తనను తాను కాల్చుకున్నాడు. ఈ విషయాన్ని మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి సాజిక్ తంపాక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మణిపూర్ పోలీసులు విచారణకు ఆదేశించారు. కాల్పులకు పాల్పడిన సైనికుడిది చురాచాంద్‌పుర్ అని గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స కోసం మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం…
Amit Shah: భారతదేశంలోకి మయన్మార్ నుంచి స్వేచ్ఛగా ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు మయన్మార్ సరిహద్దుల్లో కంచెను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మయన్మార్‌లో జాతుల సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు అక్కడి సైనికులు భారత్ లోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మయన్మార్‌తో భారత్ సరిహద్దుల్ని బంగ్లాదేశ్‌తో సమానంగా రక్షించాలని అస్సాం పోలీస్ కమాండో పాసింగ్ పరేడ్‌లో అమిత్ షా అన్నారు.