మణిపూర్‌లో జరిగిన తాజా దాడుల్లో మయన్మార్ మిలిటెంట్ల హస్తం కూడా ఉండే ఛాన్స్ ఉందని ఈశాన్య రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ కమాండోలు ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడిన కుకీ మిలింటెంట్లకు మయన్మార్ తీవ్రవాదుల నుంచి సహాయం అందిందని భద్రతా సలహాదారు కుల్దీప్ అనుమానం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభమైంది.మణిపూర్‌లోని తౌబాల్ నుంచి 'భారత్ జోడో న్యాయ యాత్ర'ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ జెండా ఊపి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం (జనవరి 14) 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'ను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమై ముంబైకి చేరుకుంటుంది.
Manipur:మణిపూర్‌లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు.
Heavy Fuel Leak from Manipur’s Leimakhong Power Station: ఇప్పటికే జాతి హింసతో అట్టుడుకుతోన్న మణిపుర్‌ను మరో ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. మణిపుర్‌లోని ఓ పవర్ స్టేషన్ నుంచి భారీగా ఇంధనం లీక్ అయ్యింది. కాంగ్‌పోక్పి జిల్లాలోని లీమాఖోంగ్ పవర్ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. పవర్ స్టేషన్ నుంచి భారీగా ఇంధనం వెలుపలికి రావడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇంధనం నదుల్లోకి చేరకుండా.. వెంటనే చర్యలు తీసుకోవాలని మణిపూర్ ప్రభుత్వం…
Manipur Violence Latest Updates: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని మరోసారి కాల్పులు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలో బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ కమ్యూనిటీ మధ్య జరిగింది. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులుఅదృశ్యం అయ్యారు. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ నిర్వహించాయి. ఈ కాల్పుల వల్ల 100 మందికి పైగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు…
మణిపూర్ నుంచి జనవరి 14న రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కానీ మణిపూర్ సర్కార్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ పర్మిషన్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.
Manipur : గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య హింస తీవ్ర రూపం దాల్చింది. ఈ కాలంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు.