Floods In Manipur: మణిపూర్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయికే ఇవాళ (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది.
మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అసోం రైఫిల్స్ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మణిపూర్‌లో భూకంపం సంభవించింది. కామ్‌జోంగ్‌లో ఈరోజు ఉదయం 5:32 గంటలకు భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది.
మణిపుర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ ముందస్తు భద్రతా కాన్వాయ్ పై ఇవాళ (సోమవారం) మెరుపు దాడి చేశారు. భద్రతా కాన్వాయ్ వాహనాలపై పలుమార్లు తుఫాకీతో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ.. మెజారిటీ మార్కును తాకేలా కనిపించడం లేదు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. హింసాకాండతో చెలరేగిన మణిపూర్లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు.. బీజేపీ, ఎన్‌పీఎఫ్‌లు తమ స్థానాలను కోల్పోయేలా కనిపిస్తున్నాయి.
మణిపూర్లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున మణిపూర్‌లోని చందేల్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో.. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
మణిపూర్ రాష్ట్రంలో హింసకు మయన్మార్ లో ప్లానింగ్ జరిగినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. గతేడాది మణిపూర్ లో రెండు జాతుల మధ్య గొడవలో పాల్గొనేందుకు యువకులకు తుపాకులతో శిక్షణ ఇచ్చారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది.
Manipur: మణిపూర్లో కుల హింసకు గురై ఏడాది కావస్తున్నా దాని కాటు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతూనే ఉంది. తమ సొంత రాష్ట్రం రెండు వర్గాలుగా విడిపోయి, తరతరాలుగా కలిసిమెలిసి ఉన్న కుటుంబాలు, ఇరుగుపొరుగు వారు విడిపోయిన ఈ రోజును మణిపురి ఎలా మర్చిపోగలదు.
Manipur : మణిపూర్లో హింస చల్లారడం లేదు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఆదివారం ఉదయం కుకీ, మెయిటీ కమ్యూనిటీల మళ్లీ కుల వివాదం రాజుకుంది. ఈ కారణంగా గ్రామ వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగాయి.
Manipur : మణిపూర్లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. వీరిద్దరూ 128వ బెటాలియన్‌కు చెందినవారు. ఈ ఘటన నరసేన ప్రాంతంలో చోటుచేసుకుంది.