మణిపూర్‌లో డ్రోన్ బాంబు దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళ గాయపడింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సెంజామ్ చిరాంగ్‌లో సోమవారం జరిగిన మరో డ్రోన్ బాంబు దాడిలో 23 ఏళ్ల మహిళ గాయపడినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
Manipur : మణిపూర్‌లో సెప్టెంబర్ 1 ఆదివారం మరోసారి హింసాత్మక ఘటనకు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మరణించగా,
వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో సంపూర్ణ శాంతి నెలకొంటుందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు. పదవి నుంచి వైదొలగడానికి నిరాకరించిన ఆయన, తాను ఎలాంటి నేరం చేయలేదని, కుంభకోణం చేయలేదని చెప్పారు.
స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రధాని మోడీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక విజ్ఞప్తి చేశారు. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ను సందర్శించి, శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని ప్రధానికి రాహుల్ గాంధీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మణిపూర్ పౌరులతో రాహుల్ భేటీ అయ్యారు.
America : భారత్‌లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనల దృష్ట్యా అమెరికా తన పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దీని ప్రకారం మణిపూర్, జమ్మూకశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు, దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.
Manipur : భారత సైన్యం, మణిపూర్ పోలీసులతో సంయుక్త ఆపరేషన్‌లో, తూర్పు ఇంఫాల్ జిల్లాలోని సైచాంగ్ ఇథమ్ ప్రాంతంలో ఎనిమిది ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌లను (ఐఇడి) స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసింది.
దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కొత్తగా ఇద్దరు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నియామకాలను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ప్రకటించారు.
మణిపూర్‌లో ఉగ్రదాడి వెలుగులోకి వచ్చింది. ఆదివారం మణిపూర్‌లోని జిరిబామ్‌లో సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందంపై గుర్తు తెలియని సాయుధ దుండగులు దాడి చేశారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్, అస్సాం, మహారాష్ట్రల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Manipur : మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం, మణిపూర్ పోలీసుల సంయుక్త బృందం ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.