గతేడాది మణిపూర్ అల్లర్లతో అట్టుడికింది. ఆయా వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే తాజాగా ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడం వల్లే మణిపూర్‌లో పరిస్థితి చక్కదిద్దబడిందని ప్రధాని మోడీ తెలిపారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొందని చెప్పారు. మణిపూర్‌లో నెలకొన్న సున్నితమైన పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Bode Prasad: నోరు ఉంది కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు..
మణిపూర్‌లో సమస్య తీవ్రంగా ఉన్నవేళ హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌లోనే ఉన్నారన్నారు. దాదాపు వివిధ వర్గాలతో 15కు పైగా సమావేశాలు నిర్వహించారని తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అవసరాల మేరకు కేంద్రం కూడా నిరంతరం తన మద్దతు కొనసాగించిందని.. సహాయ, పునరావాస కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. శిబిరాల్లో జీవిస్తున్న ప్రజల కోసం ఆర్థిక ప్యాకేజీలు వంటి చర్యలు తీసుకొన్నామని ప్రధాని తెలిపారు. ఈశాన్య భారత్ అభివృద్ధికి కేంద్రం చాలా చర్యలు తీసుకొందన్నారు. 2014 నుంచి ఆ ప్రాంతంలో విద్య కోసమే రూ.14 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. తొలి స్పోర్ట్స్ యూనివర్శిటీని మణిపూర్‌లోనే ప్రారంభించామన్నారు. ఈశాన్య భారత్‌లోని 8 రాష్ట్రాల్లో కలిపి 200 ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. గత పదేళ్లలో ఆ ప్రాంతంలో 4,000 స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయన్నారు.
ఇది కూడా చదవండి: CPI(M): ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన సీపీఐ(ఎం)..
మైతేయిలకు ఎస్టీ కోటా ఇవ్వాలన్న డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆదివాసీల సంఘీభావ ర్యాలీ చేపట్టారు. అనంతరం అల్లర్లు చోటుచేసుకున్నాయి. 160 మంది హింసలో ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రాష్ట్రంలో పరిస్థితికి కేంద్ర వైఖరే కారణమని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాదు.. ప్రధాని మోడీ ఆ రాష్ట్రాన్ని ఇప్పటివరకు సందర్శించకపోవడాన్ని తప్పు పట్టింది.
ఇది కూడా చదవండి: Vassishta: ధర్మ యుద్ధం మొదలు ఇక విశ్వంభర విజృంభణమే.. కాకరేపుతున్న డైరెక్టర్ పోస్ట్