మణిపూర్ రాష్ట్రంలో గత ఏడాది అల్లర్లతో అట్టుడికిపోయింది. మైతీ, కుకీ తెగల మధ్య గొడవలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ దాడుల్లో 219 మంది చనిపోయారు. ఇంకా వేల మంది పునరావాస శిబిరాల్లోనే ఉంటున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. ఇక, ప్రస్తుతానికి గొడవలు సద్దుమణిగినా ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు రావడంతో మణిపుర్‌లో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఒక నియోజకవర్గంలో పూర్తిగా, మరో నియోజకవర్గంలో సగ భాగానికి ఈ నెల 19వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మిగిలిన సగ భాగానికి ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. అయితే, పోలింగ్‌కు ఇంకా రెండు వారాలే సమయం ఉంది. అయినా, ఆ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. ఎక్కడా ర్యాలీలు, సభలు, కనీసం పోస్టర్లు కూడా కనిపించడం లేదు..
Read Also: Manjummel Boys Telugu: తెలుగులో రికార్డు నెలకొల్పిన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’!
అయితే, ఎన్నికల సమయంలో కనిపించే హడావుడి మణిపుర్‌లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక, ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులు మాత్రమే కనిపిస్తున్నాయి. మణిపుర్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అక్కడ ప్రచారం చేసేందుకు జాతీయ స్థాయి నేతలెవరూ వెళ్లడం లేదు.. ఎందుకంటే, అక్కడ మళ్లీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తే.. మళ్లీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉంది.. శాంతిభద్రతలు అదుపు తప్పుతాయనే భయంతో ఏ పార్టీ రిస్కు తీసుకోవడం లేదు.
Read Also: JP Nadda: హమ్మయ్య.. జేపీ నడ్డా భార్య కారు దొరికిందోచ్..
ఇక, వేల మంది ప్రజలు పునరావాస శిబిరాల్లో ఉంటున్నారు.. వారంతా ఓటు వేసేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. శిబిరాల దగ్గరే ఓటేసేలా పోలింగ్ కేంద్రాలను రెడీ చేసింది. అయితే అభ్యర్థులు ఈ శిబిరాల దగ్గరకు వచ్చే ధైర్యం చేయడం లేదు.. మైతీలు ఉండే లోయ ప్రాంతాలతో పాటు కుకీలు ఉండే కొండ ప్రాంతాల్లోనూ ప్రచారం చేయలేని పరిస్థితి ప్రస్తుతం మణిపూర్ లో నెలకొంది. అయితే, కొన్ని కుకీ గ్రూపులు ఇప్పటికే లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాయి.