Manipur Violence: మణిపూర్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. వారం రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా స్వయంగా మణిపూర్‌లో మూడు రోజులు ఉన్నారు. ఈ సమయంలో ఆయన తరచుగా సమావేశాలు నిర్వహించారు.
Manipur Violence: మణిపూర్లో గత నెలలో మొదలైన హింస సద్దుమణిగేలా కనిపిస్తోంది. గత 20 గంటలుగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. ఈరోజు ఇంఫాల్ ఈస్ట్, విష్ణుపూర్‌తో సహా అనేక హింస ప్రభావిత జిల్లాల్లో కర్ఫ్యూను 8 నుండి 12 గంటల పాటు సడలించారు.
మణిపూర్లో జరిగిన హింస సందర్భంగా భద్రతా దళాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హింస సందర్భంగా ఆయుధాలు తీసుకెళ్లి ఇప్పటి వరకు అప్పగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హెచ్చరించారు.
Manipur Violence: జాతుల సంఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 80 మందికి పైగా ప్రజలు మరణించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న మణిపూర్ వెళ్లారు. శాంతి స్థాపన కోసం పలు పార్టీలతో సంభాషించారు. మరోవైపు తిరుగబాటుదారుల ముగుసులో ఉగ్రవాదులు గ్రామాలు, ప్రజలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మణిపూర్ సరిహద్దును అనుకుని ఉన్న మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వార్తలు…
Manipur Violence: మే 3న మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండ ఇంకా చల్లారలేదు. దాదాపు 80 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. దీంతో పాటు మృతుల కుటుంబంలోని ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
మణిపూర్లో శాంతి వాతావరణం నెలకొల్పడానికి స్వయంగా రంగంలోకి దిగిన కేంద్ర హోం శాఖ మంత్రే అమిత్ షా మంగళవారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో సమావేశం అనంతరం శాంతి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Amit Shah Manipur visit: దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లుతున్న మణిపూర్‌లో శాంతి వాతావరణం నెలకొల్పడానికి స్వయంగా కేంద్ర హోం మంత్రే రంగంలోకి దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు చేరుకోనున్నారు. నాలుగు రోజులపాటు అక్కడే ఉండి.. రెండు వర్గాలతో శాంతి చర్చలు జరపనున్నారు. జూన్ 1 వరకు నాలుగు రోజులపాటు హోం మంత్రి మణిపూర్‌లోనే ఉండనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రెండు రోజుల…
Manipur Violence: మణిపూర్లో శాంతి నెలకొల్పేందుకు సైన్యం 'ఆపరేషన్ వెపన్ రికవరీ'ని నడుపుతోంది. రాజధాని ఇంఫాల్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవుల్లో సైన్యం ఆపరేషన్లు నిర్వహిస్తోంది. రాత్రి చీకటిలో, సైన్యం న్యూ కీథెల్‌మన్‌బీ గ్రామాన్ని ముట్టడించింది.
Amit Shah: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. మణిపూర్ లో శాంతి నెలకొనాలని అమిత్ షా గురువారం విజ్ఞప్తి చేశారు, త్వరలో ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించి హింసలో పాల్గొన్న రెండు వర్గాల ప్రజలతో మాట్లాడతానని చెప్పారు.
Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత మూడు వారాలుగా ఈ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. మైయిటీ, కుకీ జాతుల మధ్య ఘర్షణ క్రమంగా హింసాత్మక మారాయి. తాజాగా ఈ రోజు మరోసారి మణిపూర్ లో హింస చెలరేగింది. తాజాగా బుధవారం చోటు చేసుకున్న హింసలో బుల్లెట్ గాయాలకు 29 ఏళ్ల యువకుడు మరణించాడు. వేరే వర్గానికి చెందిన వారు కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బిష్ణుపూర్…