Manipur: సంక్షోభంలో చిక్కుకున్న మణిపూర్ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. చాలా చోట్ల బ్లాక్ దందా మొదలైంది. మూడు వారాల క్రితం మణిపూర్ లో గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
Manipur: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈసారి రాజధాని ఇంఫాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి.
ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ ప్రజలకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. అల్లర్లతో రాష్ట్రం అట్టుడికింది.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో బుధవారం కర్ఫ్యూ సడలించడంతో, ప్రజలు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి పెద్ద సంఖ్యలో మార్కెట్‌లకు తరలివచ్చారు. నగరంలోని ఇమా మార్కెట్‌కు జనం భారీగా తరలివచ్చారు. నగరంలోని పెట్రోల్ పంపుల వెలుపల పొడవైన క్యూలు కనిపించాయి.
మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను సురక్షితంగా స్వస్ధలాలకు పంపించేందుకు మరింత ముమ్మరంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మణిపూర్‌లోని తెలుగు విద్యార్ధులున్న కాలేజీల్లో ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్‌గా ఎంపిక చేసి, మిగిలిన ఏపీ విద్యార్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ నేపథ్యంలో ఎన్ఐటీలలో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు వచ్చేస్తామన్నారని.. ఈ విషయమై ముఖ్యమంత్రితో మేమంతా సంప్రదింపులు చేస్తూ.. రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగు చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
elangana Students: మణిపూర్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో తెలంగాణ విద్యార్థులు, అక్కడి ప్రజల భద్రతకు తెలంగాణ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. మణిపూర్ రాష్ట్రంలోని పరిస్థితులను పర్యవేక్షించడానికి, మణిపూర్‌లోని తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసింది.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింస చెలరేగడంతో, భద్రతా దళాలు త్వరలో రాష్ట్రంలోని ఇండో-మయన్మార్ సరిహద్దులో వైమానిక నిఘాను ప్రారంభించనున్నాయి. రక్షణ వర్గాల ప్రకారం, భౌతిక దాడులు జరగకుండా ప్రాంతాలను పర్యవేక్షించడానికి మానవరహిత వైమానిక వాహనాలు (UAVs) ఉపయోగించబడతాయి.
ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా 13 భాషల్లో, 499 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మాత్రం నీట్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మణిపూర్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులందరికీ రేపు నీట్ పరీక్ష ఉండదని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రోడ్‌షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్‌లో హింస చెలరేగి తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్‌లో సైనికులు చనిపోతుంటే ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.