Manipur Violence: మణిపూర్ లో గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సైన్యం మోహరించింది. మోరే, కాంగ్‌పోక్పి ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని భారత సైన్యం వెల్లడించింది. ఇంఫాల్, చురచంద్‌పూర్ ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరగుతున్నాయని తెలిపింది. సైన్యంతో పాటు పారామిలిటీరీ ట్రూప్స్ రాష్ట్రంలో మోహరించారు. అస్సాం నుంచి మరిన్ని బలగాలను భారతవాయుసేన కల్లోలిత మణిపూర్ రాష్ట్రానికి చేర్చుతోంది.
Read Also: SRH vs KKR : ప్రతీకారం తీర్చుకున్న కేకేఆర్.. పోరాడి ఓడిన సన్ రైజర్స్
మే 3న ప్రారంభమైన ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. మైతై కమ్యూనిటీని ఎస్టీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ATSU) మణిపూర్ నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’లో హింస చెలరేగింది. వాహనాలు, ఇళ్లకు నిప్పుపెట్టారు. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం బిరేన్ సింగ్ తో చర్చించారు. చుట్టు పక్కల రాష్ట్రాల సీఎంలతో కూడా ఆయన మాట్లాడారు.
మరోవైపు నకిలీ వీడియోల పట్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆర్మీ కోరింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మణిపూర్ గవర్నర్ ‘షూట్ అట్ సైట్’ ఆర్డర్స్ ఇష్యూ జారీ చేశారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. భారీ జనసమూహాలపై నిషేధంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధించారు.