మహారాష్ట్రలో రాజీకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుంది. మహావికాస్ అఘాడీని లీడ్ చేస్తున్న శివసేన పార్టీలోనే చీలిక వచ్చింది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే దాదాపు 35 మంది పైగా ఎమ్మెల్యేలతో అస్సాం గౌహతిలో క్యాంప్ పెట్టారు. శివసేన తన మూల సిద్ధాంతాలకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తోందని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలపాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. అయితే మహారాష్ట్రలో ‘మహా’…
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఒకవైపు బీజేపీ నేతలు మరోవైపు విపక్ష నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. అధికార బిజెపి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో మంతనాలు జరుపుతోంది. ఇటు విపక్షలు కూడా అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు పక్షాల నుంచి అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. విపక్షాలు ఒక తాటిపైకి వచ్చే ప్రయత్నాలు అయితే తెరవెనక గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నెల 21న మరోసారి విపక్ష పార్టీలు మళ్లీ భేటీ…
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నియమించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అడుగు కూడా ముందుకు పడటం లేదు. విపక్షాలు అనుకుంటున్న అభ్యర్థులు క్రమంగా తాము పోటీలో ఉండబోవడం లేదని చెబుతున్నారు. గతంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ను అనుకున్నప్పటికీ.. ఆయన నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. దీంతో విపక్షాలు మరికొన్ని పేర్లను తెరపైకి తీసుకువచ్చాయి. తాజాగా శరద్ పవార్…
ఇప్పుడు చర్చ మొత్తం రాష్ట్రపతి ఎన్నికలపైనే.. అధికార కూటమి అభ్యర్థి ఎవరు? అనే చర్చ ఓవైపు జరుగుతుంటే.. ప్రతిక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు? ఈ రోజు తేలిపోనుందా? అనే చర్చ సాగుతోంది.. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. అందులో భాగంగా టీఎంసీ సుప్రీం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇవాళ విపక్షాలతో సమావేశం కానున్నారు.. అయితే, ఈ భేటీకి దూరంగా ఉంటున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్…
రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు… కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. కాంగ్రెస్, దాని మిత్రాలను కోరనుంది బీజేపీ. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చల జరిపే బాధ్యతను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అప్పగించింది. విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టకుండా.. తాము నిలిపే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమయ్యాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థిని…
ఇవాళ రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుండటం, అలాగే ఢిల్లీలో విపక్ష పార్టీలు సమావేశం అవనుండటంతో… హస్తినలో జరిగే రాజకీయ పరిణామాలపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి నెలకొంది. జులై 24వ తేదీన రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. 25వ తేదీలోపు కొత్త రాష్ట్రపతి ఎన్నుకోవాల్సి ఉంది. ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి… నేడు నోటిఫికేషన్ను విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే నెల 18న ఎన్నికలు, 21న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఎలక్టరోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక…
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇవాళ్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీ వేదికగా కీలక సమావేవాన్ని ఏర్పాటు చేశారు.. బీజేపీయేతర పక్షాలకు చెందిన 20 మందికి పైగా నేతలకు…
రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓవైపు థర్డ్ ఫ్రంట్, కొత్త పార్టీ ఏర్పాటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. మరోవైపు.. ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడిపోయారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దీనికోసం ఈ నెల 15న ఢిల్లీ వేదికగా కీలక సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు పిలుపునిచ్చిన దీదీ.. తాను ఏర్పాటు చేసే సమావేశానికి రావాల్సిందిగా 22…
రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి ప్రతిపక్షాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు ధీటుగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ వంటి నేతలు ఈ విషయంపై చర్చిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల గురించి మమతా బెనర్జీ ఢిల్లీలో సమావేశం నిర్వహించబోతున్నారు. జూన్ 15న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాయింట్ మీటింగ్లో పాల్గొనేందుకు ప్రతిపక్ష సీఎంలకు లేఖ రాశారు. సీఎం కేసీఆర్ తో పాటు దేశంలోని ఎన్డీయేతర ముఖ్యమంత్రులు, ప్రధాన నాయకులకు ఫోన్లు చేస్తున్నారు మమతా బెనర్జీ.…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఉద్రిక్తతలను కలుగచేశాయి. ఢిల్లీ నుంచి మొదలుకుని ఉత్తర్ ప్రదేశ్, రాంచీ, హైదరాబాద్, హౌరా ఇలా పలు ప్రాంతాల్లో ముస్లింల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. జార్ఖండ్ రాంచీలో అల్లర్లలో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో నిరసన పేరుతో అల్లర్లకు పాల్పడ్డారు. చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో బీజేపీ ఆఫీసులను దగ్ధం చేశాయి అల్లరిమూకలు. ఇదిలా ఉంటే అల్లర్లపై…